డేంజర్ ఫీల్డ్
ABN , Publish Date - Jan 24 , 2026 | 01:03 AM
ఇంకా ప్రారంభం కాని ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిత్యం ప్రమాదాల కు నిలయంగా మారింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రేచర్ల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని దేవరపల్లి వర కు 162 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగింది.
ప్రారంభం కాకుండానే గాల్లో కలుస్తున్న ప్రాణాలు
జంగారెడ్డిగూడెం రూరల్ /కామవరపుకోట/కల్లూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఇంకా ప్రారంభం కాని ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిత్యం ప్రమాదాల కు నిలయంగా మారింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రేచర్ల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని దేవరపల్లి వర కు 162 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగింది. కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద చిన్న పెండింగ్ పని మినహా మిగిలినదంతా పూర్తయ్యింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఆంరఽధాకు రాకపోకలు సాగేందుకు ఎటువంటి మలుపులు లేకుండా పచ్చటి పొలాల మధ్య నాలుగు వరుసల ఈ హైవే పనులు దాదాపు పూర్తయినా అధికారి కంగా రాకపోకలు ప్రారంభం కాలేదు. ఇటీవల సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వచ్చే వాహనాలతో విజయ ువాడ హైవే రద్దీగా మారడంతో ఈ హైవేపై అనధికారికంగా వాహనాలను అనుమతించారు. వాస్తవానికి కార్లు, బస్సులు, లారీలను మాత్రమే అనుమతిస్తారు. రోడ్డు ప్రారంభం కాకపోవడంతో ద్విచక్ర వాహనదారులు యథేచ్ఛగా హైవే మీదకు వచ్చేస్తున్నారు. ఎటువంటి ట్రాఫిక్ లేక పోవడంతో అతివేగంగా వాహనాలు నడపడంతో అదుపు తప్పి మృత్యు వాతకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల– ముచ్చవరం గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కామవ రపుకోట మండలం కె.ఎస్.రామవరానికి చెందిన గట్టు రాంబాబు(40), జంగా రెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన కొమ్ము సాయి(39) ఇద్దరూ బావా బావమరుదులు, వీరిద్దరూ శుక్రవారం తెల్లవారు జామున మొక్క జొన్న సీడ్స్ వ్యాపారం కోసం వైరా వెళ్లేందుకు బైక్‌పై బయలుదేరారు. లింగాల సమీపంలోకి వచ్చే సరికి వేగంగా వెళుతున్న వారి బైక్ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఇద్దరూ ఎగిరి రోడ్డు మీద పడి అక్కడిక్కడే మృతి చెందారు. కల్లూరు ఎస్‌ఐ డి.హరిత మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరి దుర్మరణంతో విషాదం
బావా బావమరుదల మృతి వారి స్వస్థలాలు కె.ఎస్.రామవరం, లక్కవరం గ్రామాల్లో విషాదం నెలకొంది. రాంబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద విష యం తెలిసిన వెంటనే బంధువులు హుటాహుటీన ఘటనా ప్రాంతానికి తరలివెళ్లారు.