Share News

ఎప్పుడు కూలతాయో.. ఎవరిపై పడతాయో!

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:19 AM

నిత్యం వాహనాలు, ఉద్యోగుల రాక పోకలు సాగించే రోడ్ల పక్కన ఎండిపోయి న చెట్లు ప్రమాదకరంగా మారాయి.

ఎప్పుడు కూలతాయో.. ఎవరిపై పడతాయో!
ఎస్పీ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో ఎండిన కొమ్మలతో ఉన్న చెట్టు

రోడ్ల పక్కన ప్రమాదకరంగా చెట్లు

ఏలూరు రూరల్‌, అక్టోబరు 7(ఆంధ్రజ్యో తి): నిత్యం వాహనాలు, ఉద్యోగుల రాక పోకలు సాగించే రోడ్ల పక్కన ఎండిపోయి న చెట్లు ప్రమాదకరంగా మారాయి. ఏలూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పడమర లాకుల సమీపంలో భారీ చెట్టు పూర్తిగా ఎండిపోయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో వాహనాలతో పాటు పాదచారులు, విద్యార్థు లు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రం ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏలూరు జడ్పీ కార్యాలయంలో భారీ మర్రి చెట్టు వర్షాలకు నానిపోయి వేళ్లతో సహా కూలిపోయింది. ఆరోజు సెలవు కావడంతో ఉద్యోగులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకముందే ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగు తుందోనని ఆందోళన వ్యక్తమవుతున్నది.

Updated Date - Oct 08 , 2026 | 12:19 AM