జనాలపై సైబర్ వల
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:54 AM
పెంటపాడు మండలంలో ఓ గృహిణి మీ షో యాప్‌లో గృహోపకరణ వస్తువులు బుక్ చేసుకున్నారు. అవి నచ్చలేదు. ముందుగానే సొమ్ములు చెల్లించేశారు.
జనాలపై సైబర్ వల
ఆఫర్‌ల పేరుతో కుచ్చుటోపీ
వ్యక్తిగత రుణ గ్రహీతలు బాఽధితులే
ఆన్‌లైన్ కొనుగోళ్లలోనూ మోసాలే
పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న బాధితులు
అవగాహన కల్పిస్తున్న యంత్రాంగం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పెంటపాడు మండలంలో ఓ గృహిణి మీ షో యాప్‌లో గృహోపకరణ వస్తువులు బుక్ చేసుకున్నారు. అవి నచ్చలేదు. ముందుగానే సొమ్ములు చెల్లించేశారు. యాప్‌లో చూపించి నట్టుగా వస్తువులు లేవు. దాంతో తిరిగి పంపి ంచేశారు. చెల్లించిన రూ.1500 కోసం మీ షో కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్‌లో వెతి కారు. ఓ నెంబర్ దొరికింది. దానికి ఫోన్ చేశా రు. అవతల వ్యక్తి ఫోన్‌లోనే గృహిణి వివరా లన్నీ తెలుసుకున్నారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పంపితే తక్షణమే సొమ్ములు జమ అయిపోతాయని నమ్మించారు. గృహిణి అలాగే చేశారు. అంతే పది నిమిషాల వ్యవధిలో మూడు పర్యాయాలు గృహిణి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.85 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయినట్టు సం దేశం వచ్చింది. అంతే తాడేపల్లిగూడెంలో కేం ద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్తకు ఫోన్ చేశారు. భర్త వెళ్లిన తర్వాత విషయాన్ని చెప్పారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అదే పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో ఎనిమిది సైబర్ కేసులు పెండిం గ్‌లో ఉన్నాయి. వీటిని ఛేదించడం పోలీసు లకు గగనమైపోతోంది.
సైబర్ నేరగాళ్లు ఇటీవల పెద్ద స్కెచ్‌లే వే స్తున్నారు. ఎవరైనా ఫైనాన్స్ కంపెనీల్లో రుణా లు తీసుకుంటే సకాలంలో వాయిదా చెల్లిం చాలి. అలా కాని పక్షంలో ఫోన్‌ల ద్వారా రుణ గ్రిహీతతో మాట్లాడుతున్నారు. వాయిదాలో కొంత మొత్తాన్నైనా చెల్లించాలంటూ అటు వైపు వ్యక్తులు వ్యక్తిగత నెంబర్‌లు ఇస్తున్నారు. దానికి ఫోన్ పే చేయాలని సూచిస్తున్నారు. అలా సొమ్ములు చెల్లించిన తర్వాత వాయి దాలో జమ చేయడం లేదు. ఇలా జిల్లాలో అనేకమంది నష్టపోతున్నారు. ఇటువంటి సం ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా ఉంటున్నాయి. ఆఫర్‌ల పేరుతోనూ సైబర్ నేరాల జాబితాలో చిక్కుకున్న వారూ ఉంటున్నారు. భీమవరంలో ఇటీవల యాపిల్ ఫోన్ కేవలం రూ. 12వేలకు ఇస్తామంటూ యూట్యూబ్‌లో ఆఫర్‌ను చూశా రు. సదరు చిరువ్యాపారి దానిపై క్లిక్ చేసి సొమ్ములు చెల్లించారు. తీరా రెండు యాపిల్ కాయలు పార్శిల్‌లో వచ్చాయి. దాంతో సదరు చిరువ్యాపారి అవాక్కయ్యారు. తణుకు పట్టణ ంలో అల్పాహారం చేసుకునే కుటుంబానికి రుణం ఇస్తామంటూ వాట్సప్‌లో మెసేజ్ పంపారు. తీరా క్లిక్ చేస్తే ఓకే అంటే ఫైనాన్స్ కంపెనీ పేరుతో ఫోన్ వచ్చింది. ముందుగా ప్రొసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పడంతో రూ. 50వేలు కట్టేశారు. ఆ తర్వాత అవతలి వ్యక్తి ఫోన్ స్విచాఆఫ్ అయిపోయింది. ఇలా సైబర్ నేరగాళ్ల వలల పడిపోవడం సాధారణ మైపోయింది. జిల్లాలో కేసులు నమోదవు తున్నాయి. పోలీసులు కూడా వాటిని ఛేది ంచలేని పరిస్థితి నెలకొంది.
ఖాతాల్లో సొమ్ములుంటే చాలు..
బ్యాంకు ఖాతాల్లో సొమ్ములున్న వారిని కూడా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా పెట్టుకు ంటున్నారు. క్రెడిట్ కార్డు వచ్చిందంటూ ఫోన్ లు చేస్తున్నారు. అందుకోసం ఓటీపీలు చెప్పా లని సూచిస్తున్నారు. ఏదో మోసం ఉందని గ్రహించి కార్డు వద్దని చెపితే అవతలి వ్యక్తు లు ఓటీపీ నెంబర్ ఎవ్వరికీ చెప్పకూడద ంటూ హితోక్తులు పలుకుతున్నారు. బ్యాంకు సిబ్బంది మాదిరిగా సందేశాలు ఇస్తున్నారు. ఓటీపీ చెప్పినట్టయితే ఖాతాల్లో సొమ్ములు మాయమైపోతున్నాయి. జిల్లాలో ఇటువంటి బాధితులు కూడా అధికంగానే ఉంటున్నారు. సేవింగ్స్ ఖాతాలో సొమ్ములు అధికంగా ఉన్నవారినే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. సొమ్ములున్న విషయాన్ని సైబర్ నేరగాళ్లకు ఎలా తెలుస్తుందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంటోంది. మొత్తంపైన సైబర్ బాధితులు ఎక్కువ కావడంతో పోలీసు యంత్రాంగంపై వీటీపై దృష్టి పెట్టింది. నేరాలను చేధించడం కంటే ప్రజల్లో అవగాహన కల్పిస్తే మోసాలు తగ్గుతాయన్న ఉద్దేశంతో అధికారులు కళాశా లల్లో యువతతో సమావేశాలు ఏర్పాటు చేస్తు న్నారు. అవగాహన సదస్సులు నిర్వహి స్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నా..
సైబర్ నేరాలపై ముఖ్యంగా యువతలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఫోన్ లలో వచ్చిన యాప్‌లను కూడా తెరవకూ డదంటూ చెప్పుకొస్తున్నారు. ఇంట్లో తల్లిదం డ్రులకు కూడా మోసపోకుండా చూడాలని చెబుతున్నారు. అయినా ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరాలను చేధించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అం దిపుచ్చుకునేలా పోలీస్ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. గతంలో పదవీ విరమణ చేసిన వృద్ధ దంపతుల నుంచి దాదాపు రూ. 95 లక్షలు కొట్టేసిన ఘటనను పోలీసులు చేధి ంచారు. ఇతర దేశాల్లో ఉన్న తమ కుమారు ణ్ని సైబర్ అరెస్ట్ చేస్తున్నామంటూ భయ పెట్టారు. దాంతో ఆన్‌లైన్‌లో రూ. 95 లక్ష లు కట్టేశారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని చేధించి పోలీసులు నింది తులను పట్టుకున్నారు. సైబర్ అరెస్ట్‌లనేవి లేవంటూ పోలీసులు అవగాహన కల్పి స్తూనే ఉన్నారు.