రొయ్యపై ఉత్కంఠ
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:21 AM
భీమవరం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రొయ్యల ఉత్ప త్తిపై ఉత్కంఠ నెలకొంది. ఎగు మతిదారులు పక్కా ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు. మరో 15 రోజులే ఎగుమతు లు వ్యవహారం తేలనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్న టారిఫ్ విధానం రొయ్యల ఉత్పత్తులపై మరింత ప్రభా వం చూపనుంది.
ట్రంఫ్ ఎఫెక్ట్
ఈ 15 రోజులే కీలకం
సుంకాలపై ఏ నిర్ణయం వస్తుందోనని రైతుల్లో టెన్షన్
భీమవరం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రొయ్యల ఉత్ప త్తిపై ఉత్కంఠ నెలకొంది. ఎగు మతిదారులు పక్కా ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు. మరో 15 రోజులే ఎగుమతు లు వ్యవహారం తేలనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టారాజ్యంగా ప్రకటిస్తున్న టారిఫ్ విధానం రొయ్యల ఉత్పత్తులపై మరింత ప్రభా వం చూపనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 30–40 కౌంట్ రొయ్యలు ఎక్కు వగా అమెరికాకు ఎగుమతి అవుతుంటా యి. గోదావరి జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే 60 శాతం రొయ్యలకు అమెరికానే ప్రధాన మార్కెట్. మిగిలిన రొయ్యలను యూరప్, జపాన్, చైనా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో ట్రంప్ విధించి 50 శాతం టారిఫ్‌పై రొయ్యల వ్యాపారంపై పెను ప్రభావం చూపించలేదు. అక్కడి దిగుమతిదారులే ఆ భారాన్ని భరించారు. ధరలు పెంచి అమ్ముకున్నారు. నష్టపోయింది అమెరికన్లే. దీని ప్రభావం మన వద్ద రొయ్యల ధరలు యఽథావిధిగానే ఉన్నాయి. రైతుల నుంచి 30 కౌంట్ రొయ్యలు రూ.400 కొనుగోలు చేస్తున్నారు. 100 కౌంట్ రూ.240 కు విక్రయి స్తున్నారు.
ఆర్డర్లపై ఉత్కంఠ
తాజాగా ఇండియా ఉత్పత్తులపై 500 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఎగుమతిదారుల్లో ఉత్కంఠ మొదలైంది. జనవరి 15 తర్వాత అక్కడి దిగుమతిదారులు పెట్టే కొత్త ఆర్డర్ల కారణంగా మన రొయ్యల మార్కెట్ ఆధారపడి ఉంటుంది. దీంతో అమెరికాలో దిగుమతి చేసుకునే వ్యాపారులు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై ఎగుమతిదారులు ఉత్కంఠగా ఉన్నారు. అక్కడ డిమాండ్‌ను బట్టి ఆర్డర్లు ఉంటాయి. ఇప్పటికే అమెరికా వ్యాపారులు టారిఫ్‌పై అక్కడ న్యాయస్థానాలను ఆశ్రయించా రు. వాటి తీర్పుపై భవిష్యత్తు టారిఫ్ ఆధారప డి ఉంటుంది. అమెరికాకు ఎగుమతులు మందగిస్తే ఇతర దేశాలైన యూరప్, జపాన్, చైనాలపైనే ఆధారపడాల్సిందే. 30–40 కౌంట్ రొయ్యల కు మాత్రం అమెరికాలోనే అధిక ధర లభిస్తోం ది. చైనా, జపాన్ దేశాల్లో 100 కౌంట్ వినియో గం ఎక్కువ. అయినప్పటికి స్థానికంగా 100 కౌంటు రొయ్యలను ప్రోసెసింగ్ చేయాలంటే వ్యయ ప్రయాసలను భరించాలి. అదే ఇప్పుడు ఎగుమతి దారులను ఆందోళనకు గురిచేస్తోంది.
వైరస్.. టారీఫ్‌లతో ఉక్కిరిబిక్కిరి
ట్రంప్‌టారిఫ్ విధానంతో రైతులు మేలుకొన్నారు. రొయ్యలసాగును తగ్గించారు. నిజానికి ఉభయ గోదావరి జిల్లాలో ఏటా 12 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఒక్క పశ్చిమలోనే ఆరు లక్షల టన్నుల ఉత్పత్తులు సాధిస్తున్నారు. జిల్లాలో ఇది వరకు లక్ష ఎకరాల్లో రొయ్యల చెరువులను సాగు చేసేవారు. ఇప్పుడది 60 వేలకు తగ్గింది. చేపల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఓ వైపు వైరస్, మరో వైపు టారిఫ్ విధానాలతోరైతులు రొయ్యల సాగును విరమిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో చేపల సాగు విస్తీర్ణం 20 వేల నుంచి 30 వేల ఎకరాలకు పెరిగింది. ఇది మరికొంత పెరిగే అవకాశం ఉందని మత్స్య శాఖ అంచనా వేస్తోంది. ఇతర దేశాలతో వాణిజ్యం కుదుట పడితే సాగు పెరిగే అవకాశం ఉంది.