పోటెత్తారు..
ABN , Publish Date - Mar 24 , 2026 | 01:10 AM
కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్ర మానికి అర్జీదారులు పోటెత్తారు. గత సోమవారం పీజీఆర్‌ఎస్ రద్దయిన నేపథ్యంలో ఈవారం అర్జీదారులు భారీగా తరలి రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసింది.
ఏలూరు రూరల్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్ర మానికి అర్జీదారులు పోటెత్తారు. గత సోమవారం పీజీఆర్‌ఎస్ రద్దయిన నేపథ్యంలో ఈవారం అర్జీదారులు భారీగా తరలి రావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసింది. కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, తదితర అధికారులు 358 అర్జీలను స్వీకరిం చారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ కార్యక్రమం ముగియాల్సి ఉండగా మరికొంత సమయం పొడిగించారు. కలెక్టర్ మాట్లాడు తూ పీజీఆర్‌ఎస్‌లో అందిన ప్రతిఅర్జీని పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి, నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు.
ఒకరి భూమి మరొకరికి కట్టబెట్టారు..
టి.నర్సాపురం మండలం అల్లంచర్ల రాజుపాలేంకు చెందిన చొప్ప మధుసూదనరావుకు ఆగ్రామంలో వారసత్వంగా వచ్చిన 35 సెంట్లు భూమి ఉంది. సర్వే నంబర్ 85–2లో ఉన్న ఆ భూమిని కొంతకాలం క్రితం సరిహద్దు పొలానికి చెందిన ఓ రైతుకి కౌలుకు ఇచ్చాడు. అయితే ఆ రైతు రెవెన్యూ అధికారుల సహకారంతో తన పేరున ఆ భూమిని మార్పించుకున్నాడు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించిన రెవెన్యూ అధికారులు, తదితరులపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని బాధితుడు కలెక్టర్‌కు విన్నవించాడు.
ఎస్పీ కార్యాలయంలో 43 ఫిర్యాదులు
ఏలూరు క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కార్యాలయం వరకు వచ్చి సమయం, డబ్బు వృఽథా చేసుకోకుండా డీఎస్పీ, సీఐ కార్యా లయాల్లోనే ఫిర్యాదు చేయవచ్చని లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యా దు చేయవచ్చని ఎస్పీ కేపీఎస్ కిశోర్ సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 43 మంది తమ ఫిర్యాదులను ఎస్పీకి అందించారు.