Share News

ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేశారు

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:37 AM

ఓ మహి ళ హత్య కేసులో ఒక చిన్న స్ర్కూ.. హతు రాలిని గుర్తించేలా చేసింది. ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేస్తే.. శవం ఆచూకీ ఎవరూ గుర్తుపట్టలేరని భావించిన హంతకుడిని పట్టించింది.

ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేశారు

ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేశారు

భార్యాభర్తల మధ్య వివాదమే హత్యకు కారణం..

ముంబై, హైదరాబాద్‌, భీమవరంలలో దర్యాప్తు..

చివరకు ఆకివీడు కేసును చేధించిన పోలీసులు

ఆకివీడు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):ఓ మహి ళ హత్య కేసులో ఒక చిన్న స్ర్కూ.. హతు రాలిని గుర్తించేలా చేసింది. ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేస్తే.. శవం ఆచూకీ ఎవరూ గుర్తుపట్టలేరని భావించిన హంతకుడిని పట్టించింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 15న ఉదయం ఆకివీడు మండలం ఉప్పుటేరు సమీపాన మందపాడు రోడ్డు పొదల్లో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 18న పోస్టుమార్టం చేయగా కుడి కాలులో స్టీల్‌ రాడ్‌, ఏడు స్ర్కూ ళ్లను గుర్తించారు. స్ర్కూపై వున్న నెంబరు, కోడ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ‘శరీరంలో వేసే ఇంప్లాంట్స్‌’కు చెందిన అది ముంబైలోని ఓ కంపెనీకి చెందినదని గుర్తించారు. స్థానిక పోలీసుల టీమ్‌ అక్కడకు వెళ్లి విచారించింది. ఈ ఇంప్లాంట్‌ను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి పంపించామని వారు వివరించ డంతో.. అక్కడి నుంచి పోలీసులు నేరుగా ఆసుపత్రికి వెళ్లి విచారించారు. అది భీమవ రానికి చెందిన ఓ మహిళ కాలుకు వేశామని, ఆమె వివరాలను వైద్యులు అందజేశారు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి భర్తను తమదైన శైలిలో విచారిస్తే.. అసలు నిజాలన్నీ తన్ను కుంటూ బయటకువచ్చాయి. భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగానే ఆమెను భర్తే చంపేసి మృతదేహాన్ని ఉప్పుటేరు పొదల్లో పాడేస్తే జారుకున్నట్టు సమాచారం. ఉప్పుటేరులో పడేస్తే.. కొట్టుకుపోతుందని, కొద్ది రోజులకు ఉబ్బిపోయి మృతదేహం ఆచూకీ తెలియదని ఆ భర్త ఈ పనిచేసినట్లు తెలుస్తోంది.

గడిచిన వారం రోజులుగా డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, సీఐ కాళీచరణ్‌, ఎస్‌ఐ శుభశేఖర్‌ ఆధ్వ ర్యంలో పోలీసులు మృతురాలి ఆచూకీతోపాటు హత్య కేసును చేదించేందుకు ఎన్నో ప్రయ త్నాలు చేశారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఇటీ వల వచ్చిన మహిళల చిరునామాలు సేక రించి, వారికి ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకొనే ప్రయత్నం చేశారు. టవర్‌ డంప్‌ ఆధా రంగా సెల్‌ నెంబర్లు సేకరించి, వాటి ద్వారా సమాచారం సేకరించేందుకు చర్యలు చేపట్టా రు. చివరకు ఓ చిన్న స్ర్కూ ఆధారంగా పోలీసులు కేసును ముగింపునకు తెచ్చారు. వివరాల వెల్లడిపై గోప్యత పాటిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో మీడియాకు వివరిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:37 AM