క్రేజీ గేమ్.. బాక్స్ క్రికెట్
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:40 AM
క్రీడల్లో క్రికెట్ అంటే చాలామందికి విపరీతమైన ఆసక్తి. క్రికెట్ ఆడాలని ఉన్నా గ్రౌండ్‌కు వెళ్లే అవకాశం లేనివారికి తీరిక సమయంలో క్రికెట్ ఆడడానికి బాక్స్ క్రికెట్ అందుబాటులోకి వచ్చింది.
క్రికెట్ అభిమానుల ఉత్సాహం
ఫిట్‌నెస్‌కు ఊతం
క్రీడల్లో క్రికెట్ అంటే చాలామందికి విపరీతమైన ఆసక్తి. క్రికెట్ ఆడాలని ఉన్నా గ్రౌండ్‌కు వెళ్లే అవకాశం లేనివారికి తీరిక సమయంలో క్రికెట్ ఆడడానికి బాక్స్ క్రికెట్ అందుబాటులోకి వచ్చింది. టెస్ట్, వన్డే మ్యాచ్‌లతో పాటు మరింత తొందరగా ముగిసే టి20 మ్యాచ్‌ల మాదిరి బాక్స్ క్రికెట్ పొట్టి గ్రౌండ్ అన్నమాట. కొద్దిపాటి స్థలంలో నాలుగు వైపులా పోల్స్, మెస్, నెట్‌తో తయారు చేసిన ఆటస్థలం ఈ బాక్స్ క్రికెట్. జిల్లాలోని పల్లె, పట్టణం, పొలాల్లో బాక్స్ క్రికెట్ కనబడుతోంది. ఈ గ్రౌండ్ నిర్వహణ యువతకు ఒక ఉపాధి మార్గం కూడా.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో యువతను బాక్స్ క్రికెట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఏలూరు శివారు వట్లూరు, మినీ బైపాస్‌లో ఈ తరహా గ్రౌండ్స్ ఏర్పాటు కాగా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కామవరపుకోట, పెదవేగి, దెందులూరు, పెదపాడు, ఇతర ప్రాంతా లకు విస్తరించాయి. సుమారు 50 పైగా ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో మ్యాచ్‌లు ఆడేందుకు మినీ గ్రౌండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఏలూరు నగరంలో 15 బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌లను ఔత్సాహికులు, క్రికెట్ కోచ్‌లు, అభిమానులు ఏర్పాటు చేశారు.
గంటకు రూ.400
కొద్దిపాటి స్థలంలో 100/60 పొడవు, వెడల్పుతో బాక్స్ క్రికెట్ పిచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లడ్ లైట్లు, పచ్చని పచ్చిక (ఆర్టిఫియల్), చుట్టూ నెట్ ఏర్పాటుకు రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల పెట్టుబడి అవుతుంది. ఒక టీమ్ మ్యాచ్ ఆడుకోవా లంటే గంటకు రూ.400 రుసుం వసూలు చేస్తారు. సెలవు రోజుల్లో రూ.100 అదనం. సాఫ్ట్ టెన్నిస్ బా ల్, ఫైబర్ బాల్‌తో పాటు ఫైబర్ బ్యాట్‌లతో బాక్స్ క్రికెట్ ఆడుతున్నారు. ఫిట్‌నెస్ పెంచుకోవడానికి, గ్రౌండ్‌కు వెళ్లలేని వారికి అనువుగా ఉంది.
బాక్స్ క్రికెట్‌తో రోజంతా మ్యాచ్‌లు జరుగుతున్నా యి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. బాక్స్ క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా సాగుతున్నాయి.