Share News

పట్టించుకోరా..?

ABN , Publish Date - May 08 , 2026 | 12:26 AM

జిల్లాలో కీలకమైన ముఖ్య ప్రణాళికశాఖ (సీపీవో)లో గణాంకాధికారులు పోస్టుల ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడంతో పనితీరు గతి తప్పుతోంది.

పట్టించుకోరా..?

గతి తప్పుతున్న ప్రణాళిక శాఖ

ఏళ్ల తరబడి ఏఎస్‌వోల కొరత

ప్రభుత్వ గణాంకాల సేకరణకు కష్టం

జిల్లాలో 17 మండలాల్లో ఇక్కట్లు

ఖాళీల భర్తీపై ప్రభుత్వం చిన్నచూపు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

జిల్లాలో కీలకమైన ముఖ్య ప్రణాళికశాఖ (సీపీవో)లో గణాంకాధికారులు పోస్టుల ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడంతో పనితీరు గతి తప్పుతోంది. ప్రభుత్వశాఖల అభివృద్ధి, సంక్షేమ పఽథకాల లెక్కలు, అంకెలు, ఇతర శాతాలు గణించే కార్యక్రమాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది.

జిల్లా వ్యాప్తంగా ఏలూరు అర్బన్‌ మండలంగా ఏర్పాటు చేసిన కాలం నుంచి మొత్తం 28 అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు(ఏఎస్‌వో)లుండాల్సి ఉండగా కేవలం 11 చోట్ల అధికారులున్నారు. దీంతో మూడేసి మండలాల బాధ్యతలను ఒక్క ఏఎస్‌వోనే చూడాల్సి రావడంతో తీవ్ర పనిభారంతో ఉద్యోగులు ఇబ్బం దులు పడుతున్నారు.

ఏళ్ల తరబడి ఖాళీగానే..

ఈ శాఖలో ఖాళీ అయిన ఏఎస్‌వో పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా పోస్టులు ఏళ్ల తర బడి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో జీలుగు మిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, ద్వారకాతిరుమల, జంగా రెడ్డిగూడెం, టి.నర్సాపురం, కామవరపుకోట, నూజి వీడు, చాట్రాయి, ముసునూరు, లింగపాలెం, మండ వల్లి, కలిదిండి, ఉంగుటూరు, ఏలూరు అర్బన్‌ తదితర మండలాల్లో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు (ఏఎస్‌ వో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఏలూరు అర్బన్‌ మండలంగా విభజితమైన తర్వాత పోస్టు శాంక్షన్‌ చూపించిన.. ఆ ఖాళీని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. డివిజన్‌ స్థాయిలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఒక డీఎస్‌వో పోస్టు భ ర్తీ చేయాలని కలెక్టర్‌కు రాత పూర్వంగా ప్రణాళికశాఖ నుంచి ప్రతిపాదన వెళ్లినా.. అతీగతీ లేదు.

తీవ్ర ఒత్తిడితో సతమతం

ప్రధానంగా ఏటా పంట దిగుబడులను అంచనా వేయడానికి ఏఎస్‌వోలే కీలకంగా పంట కోతల ప్రయోగాలు చేస్తారు. అదీ కూడా ఎక్కడా సక్రమంగా చేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పైలట్‌గా పంటల కోతల ప్రయోగాలు ప్రతి మండలంలోనే చేయాల్సి ఉండగా చేయలేక పోతు న్నారు. వర్షపాత వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత వీరిపైనే ఉంది. ప్రతి రోజు రీడింగ్‌లను తీసుకొని అవి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేయా ల్సి ఉంటుంది. దీనికి సోషియో ఎకనమిక్‌, సాగునీటి వనరుల సర్వే వీరే చేయాల్సి ఉంది. జిల్లాలో ఐదు నెలలు క్రితం చేపట్టిన సాగునీటి వనరుల సర్వే ఇంకా కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం ఏఎస్‌వోల కొరత కారణంగా చెబుతున్నారు. అంచనాలను సరిచూసుకుని రికార్డు చేయకపోతే వాస్తవాలు ప్రతిబింబించకపోతే ప్రభుత్వ అభివృద్ధి ఫలాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మరోవైపు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ–4 కార్యక్రమం లెక్కలు, ఇతరత్రా విషయాలను మండలస్థాయిలో డేటా సేకరణలో ఏఎస్‌వోలు కీలకం. సమగ్ర లెక్కలను సిద్ధ్దం చేసి ప్రభుత్వానికి, జిల్లాలోని వివిధ శాఖలు వీరే లెక్కలే ప్రామాణికం.. అయినా ఈ శాఖలో ఖాళీల భర్తీపై చిన్నచూపే రాజ్యమేలుతోంది..

భర్తీ చేస్తామంటూనే.. పట్టించుకోవట్లేదు

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు పోస్టులు భర్తీని ఏపీపీఎస్‌సీ ద్వారా చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 250 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. భర్తీ చేస్తామంటూ ఏళ్ల తరబడి గడుస్తున్నా ప్రభుత్వం మా శాఖపై దయ చూపడం లేదని ప్రణాళిక శాఖాధికారులు వాపోతున్నారు. నిరంతరం ఒత్తిడితో సతమతం అవుతున్నామని ఏఎస్‌వోలు వ్యథ చెందు తున్నారు. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసి.. తమకు పని ఒత్తిడిని తగ్గించాలని వారు కోరుతున్నారు.

Updated Date - May 08 , 2026 | 12:26 AM