భూములను చూపించాలని సీపీఐ ధర్నా
ABN , Publish Date - May 12 , 2026 | 12:36 AM
పట్టాలు ఇచ్చిన సీలింగ్ భూముల పట్టాదారులకు భూములు చూపించాలని చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు.
చింతలపూడి, మే 11 (ఆంధ్రజ్యోతి) : పట్టాలు ఇచ్చిన సీలింగ్ భూముల పట్టాదారులకు భూములు చూపించాలని చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో జిల్లా సీపీఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ 1986లో కొమ్ముగూడెంకు చెందిన కొందరు ఎస్సీలకు ఎల్సీ పట్టాలు ఇచ్చారని అయితే ఈ రోజుకి వాటికి భూములు చూపలేదన్నారు. ఈ సర్వే నంబర్లలో వేరే వ్యక్తులు ఆన్‌లైన్‌లో పేర్లు మార్చుకుని సాగు చేసుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వారికి భూమి చూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసల్దార్‌కు వినతిపత్రం అందించారు. ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల గురవయ్య, దొంత కృష్ణ, ముళ్ళగిరి నాగేశ్వర రావు, వనం వెంకటేష్, ఎం.కృష్ణ, పలువురు పాల్గొన్నారు.