Share News

గోవుల అందాల, పాల పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:48 AM

‘పూర్వీకులు మనకు సారవం తమైన నేలను వారసత్వంగా ఇస్తే దానిని మనం విషతుల్యం చేస్తున్నామని.. గో ఆధారిత వ్యవసాయంతో దాన్ని ఉత్తేజవంతంగా చేసే భాధ్యత మనపై ఉంది’ అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు.

గోవుల అందాల, పాల పోటీలు ప్రారంభం
గోవుల అందాల, పాల పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు మద్దిపాటి, పత్సమట్ల, ఆప్కాబ్‌ చైరన్‌ గన్ని తదితరులు

ద్వారకాతిరుమల, మార్చి20(ఆంధ్రజ్యోతి):‘పూర్వీకులు మనకు సారవం తమైన నేలను వారసత్వంగా ఇస్తే దానిని మనం విషతుల్యం చేస్తున్నామని.. గో ఆధారిత వ్యవసాయంతో దాన్ని ఉత్తేజవంతంగా చేసే భాధ్యత మనపై ఉంది’ అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. ద్వారకాతిరుమల మార్కెట్‌యార్డులో ఈనెల 22 వరకు నిర్వహించే గోవుల పాల, అందాల పోటీ లను శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో పుంగునూరు ఆవులు 24, గిత్తలు 16, ఒంగోలు ఆవులు 45, గిత్తలు ఆరు మొత్తం 91 ఆవులు, గిత్తలు పాల్గొన్నాయి. శుక్రవారం గోవుల పొదుగులను ఖాళీ చేసే ప్రక్రియ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఏటా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ద్వారకా తిరుమలలో జరిగే పోటీలకు విశేష స్పందన ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పోటీల నిర్వాహకులు, గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు యు.చక్రపాణి, ఏఎంసీ చైర్మన్‌ వై.బ్రహ్మరా జును వారు అభినందించారు. కూటమినేతలు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న చినజీయర్‌స్వామి

చినవెంకన్న ఆలయాన్ని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి శుక్రవారం సందర్శించారు. ఆలయాన్ని శిష్యగణంతో విచ్చేసిన ఆయనకు ఆలయట్రస్టీ ఎస్వీ నివృతరావు, అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికా రు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం స్థానిక మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన గోసమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:48 AM