Share News

కౌంటింగ్‌ డే

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:57 AM

జిల్లాలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కావడంతో శనివారం నిర్వహించే కౌంటింగ్‌ ప్రక్రియలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

కౌంటింగ్‌ డే
ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

పరిషత్‌ అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే..

441 ఎంపీటీసీలు, 26 జడ్పీటీసీలు

నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు

574 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు

689 మంది సూపర్‌వైజర్లు, 1,378 మంది సిబ్బంది

ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా కౌంటింగ్‌ ప్రక్రియ

ఇప్పటికే పెదవేగి జడ్పీటీసీ.. 13 ఎంపీటీసీలు ఏకగ్రీవం

(ఏలూరు సిటీ–ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ పూర్తి కావడంతో శనివారం నిర్వహించే కౌంటింగ్‌ ప్రక్రియలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 27 జడ్పీటీసీ, 454 ఎంపీటీసీ స్థానా లుండగా ఇప్పటికే పెదవేగి జడ్పీటీసీతో పాటు 13 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన 26 జడ్పీటీసీలు, 441 ఎంపీటీసీల స్థానా లకు కౌంటింగ్‌ జరగనుంది. ఎంపీటీసీ, జడ్పీ టీసీల వారీగా కౌంటింగ్‌ జరుగు తుంది.

కౌంటింగ్‌ ప్రక్రియ ఇలా ..

జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా ఒకేసారి కౌం టింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత మూడు అంచెల భద్రత నడుమ స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ కేంద్రం లోకి తీసుకొచ్చి ఎన్ని ఓట్లు పోలయ్యాయో అనేది ఇనీషియల్‌ కౌంటింగ్‌ నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల బ్యాలెట్‌ బాక్సులను తెరచి అందులో ఉన్న బ్యాలెట్‌లను లెక్కిస్తారు. ఆ బ్యాలెట్‌ బాక్సుకు ఇచ్చిన రికార్డుకు సరిపడా బ్యాలెట్లు సరి పోయాయో లేదో పరిశీలిస్తారు. ఆ తర్వాత అసలు (డీటైల్డ్‌ ) కౌంటింగ్‌ ప్రారం భిస్తారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లు లెక్కించి జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా అభ్యర్థులకు ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో తెలుపుతారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పూర్తయిన వెంటనే సాధా రణ కౌంటింగ్‌ను ఆర్వో సమక్షంలో ప్రారంభమ వుతుంది. సాధారణ కౌంటింగ్‌ ప్రక్రియలో వచ్చిన బ్యాలెట్‌లను 25 చొప్పున కట్టలుగా కడతారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీల వారీగా కట్టిన కట్టలను డ్రమ్ములో వేసి కలుపుతారు. ఆ తదుపరి జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా అక్కడ వేసిన టేబుళ్లపై లెక్కిస్తారు. ప్రతి రౌండ్‌కు 1000 ఓట్లు చొప్పున లెక్కించి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఈసారి ఎంపీటీసీల కౌంటింగ్‌తో పాటు జడ్పీ టీసీల కౌంటింగ్‌ జరపడానికి వీలుగా అదనపు టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీంతో కౌంటింగ్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్త య్యే అవకాశం ఉంది. గతంలో ఎంపీటీసీల కౌం టింగ్‌ పూర్తయిన తర్వాతే జడ్పీటీసీల కౌంటింగ్‌ ప్రారంభిం చేవారు. ఈ సారి సాయంత్రం ఆరు గంటల్లో గానే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాలు వెల్లడయిన వెంటనే ఎన్నికలలో విజయం సాధించిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు.

ఏ ఏ మండలాలకు ఎక్కడ కౌంటింగ్‌..

జిల్లాలో ఏలూరు డివిజన్‌లో రెండు చోట్ల, జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజన్లకు సంబం ఽధించి ఒక్కొక్కటి మొత్తం నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏడు మండలాలు.. ద్వారకా తిరుమల, ఉంగుటూరు, ఏలూరు రూరల్‌, కైకలూరు, ముదినేపల్లి, భీమ డోలు, పెదవేగి మండలాలకు సంబంధించి ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో, ఆరు మండలాలు.. పెదపాడు, నిడమర్రు, కలి దిండి, దెందులూరు, మండవల్లి, కామవరపు కోట మండలాలకు ఏలూరులోని సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో, ఎనిమిది మండలాలు.. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, టి.నరసా పురం, జీలుగుమిల్లి, పోలవరం, బుట్టాయి గూడెం, వేలేరుపాడు, కుక్కునూరు మండలా లకు సంబంధించి జంగారెడ్డిగూడెం నోవా ఇంజ నీరింగ్‌ కళాశాలలో, ఆరు మండలాలు.. ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు, చింతలపూడి, లింగపాలెం మండలాలకు సంబంధించి నూజివీడులోని సారథి ఇంజనీ రింగ్‌ కళాశాలలోను కౌంటింగ్‌ ప్రక్రియ జరుగు తుంది.

లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరులోని సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం సందర్శించారు. కౌంటింగ్‌ ఏర్పాట్లను నిశితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో వాయిదా పడిన 4 జడ్పీటీసీ, 40 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం ప్రశాంతంగా పోలింగ్‌ జరిగిందన్నారు. జేసీ అభిషేకగౌడ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణమోహన్‌, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2026 | 12:57 AM