కూటమి జయహో
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:01 AM
పరిషత్ పోరులో కూటమి హవా కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మెజార్టీ స్థానాల్లో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు.
జిల్లా పరిషత్, 27 మండల పరిషత్‌ల్లోను దూకుడు
27 జడ్పీటీసీల్లో టీడీపీ 18, జనసేన 5, బీజేపీ 1, వైసీపీ 3 గెలుపు
ఎంపీటీసీల్లోను కూటమి జోరు
వైసీపీకి ఘోర పరాభవం
పునర్విభజన తర్వాత తొలి చైర్మన్ పీఠం కూటమి పార్టీలదే
నాలుగు కేంద్రాల్లోప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ
పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు
(ఏలూరుసిటీ–అంధ్రజ్యోతి):
పరిషత్ పోరులో కూటమి హవా కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మెజార్టీ స్థానాల్లో కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫలితాలు కూటమి ప్రభుత్వ పాలనకు గీటురాయిగా నిలిచాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ పోరులో హవా కనబరిచిన కూటమి ఇప్పుడు కూడా పరిషత్ పోరులో సత్తా చాటింది.
జిల్లాలో 27 జడ్పీటీసీలుండగా పెదవేగి జడ్పీటీసీ స్థానం నుంచి దెందులూరు ఎమ్మెల్యే కుమార్తె చింతమనేని సాయి నవ్యశ్రీ ఏకగ్రీవంగా విజయం సాధించిన విషయం విదితమే. జిల్లాలో ఉన్న 454 ఎంపీటీసీ స్థానాల్లో 13 స్థానాలు ఏకగ్రీవం కాగా ఇందులో టీడీపీ 7, వైసీపీ 2, జనసేన 1, బీజేపీ 1, సీపీఐ 2 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 26 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 17, జనసేన 5, వైసీపీ 3, బీజేపీ 1 దక్కించుకుంది. ఎన్నికలు జరిగిన స్థానాల్లో కూటమి తరపున 23 మంది అభ్యర్థులు విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ లోను కూటమి అభ్యర్థులకే అత్యధిక ఓట్లు పోలయ్యాయి.
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఎక్కడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో ఏలూరు. జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజన్లు ఉండగా నాలుగు చోట్ల ఈ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహించి. ఆ తరువాత మండలాలకు సంబంధించి ఎంపీటీసీల వారీగా, ఆ తర్వాత జడ్పీటీసీల వారీగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఏలూరు డివిజన్‌కు సంబంధించి ఏలూరులోని సర్ సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలో, జంగా రెడ్డిగూడెం డివిజన్‌కు సంబంధించి జంగారెడ్డిగూడెంలోని నోవా ఇంజ నీరింగ్ కళాశాలలో, నూజివీడు డివిజన్‌కు సంబంఽధించి నూజివీడులోని సారఽథి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జడ్పీ ఎన్నికలకు సంబంఽధించిన ఆర్వో, జేసీ ఎంజే అభిషేకగౌడల పర్యవేక్షణలో కౌంటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి అవాం ఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగటానికి భద్రతా ఏర్పాట్లను ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాధారణ ఎన్నికల పరిశీలకులు , రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసుల కార్యదర్శి మిరియాల వెంకట శేషగిరిబాబు జిల్లాలో ఏర్పాటు చేసిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల కౌంటింగ్ తీరును అయన పరిశీలించారు.