పరిహారం.. పరిహాసం
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:41 AM
జాతీయ రహదారి 365 బీబీ రోడ్డు నిర్మాణం నష్టాల పాలు చేస్తోందని మండల వాసులు వాపోతున్నారు. పరిహారం చెల్లింపులో వివక్ష చూపినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
జాతీయ రహదారి 365 బీబీ రోడ్డు నిర్మాణం నష్టాల పాలు చేస్తోందని మండల వాసులు వాపోతున్నారు. పరిహారం చెల్లింపులో వివక్ష చూపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రహదారి నిర్మాణం వల్ల ఇళ్లు, స్థలాలు, వ్యాపార దుకాణాలు కోల్పోయిన వారు తీవ్రంగా నష్టపోతు న్నామని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు తీస్తుందంటూ చెబుతున్న ప్రజాప్రతినిధులు స్థానికుల సమస్యలు పరిష్కరిం చేందుకు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
జీలుగుమిల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మండ లంలో తాటియాకులగూడెం తెలంగాణ ప్రాంత సరిహద్దు నుంచి వయా జీలుగుమిల్లి, పి.అంకం పాలెం, బర్రింకలపాడు, నారాయణపురం, కనకా పురం, రౌతుగూడెం గ్రామాల మీదుగా పట్టిసీమ వరకు ఎన్‌హెచ్ రహాదారి నిర్మాణ పనులను రూ.300 కోట్లు వెచ్చించి ప్రారంభించారు. ఆయా గ్రామాల్ని రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ అధి కారులు పరిశీలించి సర్వే జరిపారు. నష్టపరిహారం కోసం నివేదిక పంపారు. స్థలాలు, ఇళ్లు, వ్యాపార దుకాణాలు రోడ్డు విస్త రణలో కోల్పోయే బాధి తులకు పరిహారం సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమేనని మరోవైపు కమిషన్ల కోసం రెవెన్యూ, ఎన్‌హెచ్ అధికారులు నష్ట పరిహారం చెల్లించడంలో తారతమ్యాలు చూపారంటూ కనకాపురానికి చెంది న బాధితుడు ఓర్సు శ్రీను ఆరోపిస్తున్నాడు. గ్రామంలో కొందరి ఇంటిప్రహారీ అంచు రోడ్డు విస్తరణ పరిధిలోకి రాగా వారికి లక్షల్లో పరిహారం చెల్లించారని, మరికొందరి ఇంటికి, తక్కువ శాతం స్థలం పోయినా రూ.లక్షల్లో నష్టపరిహారం చెల్లించి నట్టు ఆరోపిస్తున్నాడు. తన ఇంటి వద్ద మరుగు దొడ్డిని రోడ్డు విస్తరణలో తొలగించారని, ఎటువంటి నష్టపరిహారం చెల్లంచలేదని, రహదారి ఎలైన్ మెంట్‌లో ఇప్పుడు తన ఇల్లును కొంతమేర తొల గించాలని అధికారులు చెబుతున్నారని వాపో యాడు. తాను అధికారులకు కమిషన్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదని, అందుకే నష్ట పరిహారం రాయలేదని ఆరోపిస్తున్నాడు. ఇటీవల పోలీస్, రెవెన్యూ అధికా రులు శ్రీను ఇల్లు తొలగించాలని కనకాపురం రాగా అతను ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పం టించుకునే ప్రయత్నం చేయడంతో అధికారులు వారించి వెనుదిరిగారు. కోల్పోయామని, ఏజెన్సీలో 1/70చట్టం ఉండడంతో మరోచోట ఇల్లు నిర్మిం చుకోవాలంటే కొనే వీలు లేకుండా పోయిందని స్థానిక బాధితులు వాపోతున్నారు. జీలుగుమిల్లి ప్రధాన నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు విస్తరణలో చిరు వ్యాపారులు సైతం నష్టపోయారు. మరోవైపు ఏడాదిగా రోడ్డు నిర్మాణ పనులు జరుపుతున్నా జీలుగుమిల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఏ ఒక్క వైపు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు మార్కింగ్ పెట్టిన కాడికి కొట్టేసి అలాగే వదిలేశారు. పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం జరిపితే తప్ప మిగిలిన ఇళ్లను సరి చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. జీలుగుమిల్లిలో కొందరికి రెండో విడత నష్టపరిహారం చెల్లించే క్రమంలో తమకు తక్కువ చెల్లించారని, జగదాంబ ఆలయం తొలగించవద్దని స్థానికులు, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారుల చుట్టూ తిరగడంతో కొంత మేర రోడ్డు విస్తరణ పనులు నిలిచాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆయా సమస్యల్ని పరిష్కరించాలని, ఇళ్లు, స్థలాలు పోగొట్టుకున్న వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలో న్యాయం చేయాలని కోరుతున్నారు.
తగ్గిన వాహనాల రద్దీ.. మూతపడ్డ వ్యాపార సంస్థలు
ఇటీవల ప్రారంభమైన గ్రీన్‌ఫీల్డ్ హైవే వల్ల వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు దూరాభారం తగ్గడంతో తల్లాడ–దేవరపల్లి వైపు అధికశాతం వాహనాలు రాకపోకలు సాగిస్తు న్నాయి. గత రెండు మూడు నెలలుగా వయా తెలంగాణ రాష్ట్రం అశ్వా రావుపేట, జీలుగుమిల్లి, జంగా రెడ్డిగూడెం మీదుగా ఈ రహదారి వెంట వెళ్లే వాహనాల గణనీయంగా రద్దీ తగ్గింది. దీంతో స్థానికంగా పలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
రోడ్డు నిర్మాణంతో నిండా మునిగాం
జీలుగుమిల్లిలో ఎన్‌హెచ్ రోడ్డు నిర్మాణంతో తమ ఇంటిని, భూముల్ని
ఆటంకం కలిగిస్తే ఊరుకోం
గతంలో ఎన్‌హెచ్ రోడ్డు విస్తరణకు స్థల సేక రణ సర్వే జరిపిన సమయంలో నేను జీలుగు మిల్లి మండలంలో విధులు నిర్వహించలేదు. సర్వే రిపోర్టులు ఆధారంగా ప్రస్తుతం కనకా పురంలో ఓర్సు శ్రీను ఇల్లు తొలగించాల్సి వస్తోం ది. ఆ స్థలంలో కొంత ప్రభుత్వ భూమి ఉంది. అధికారుల ఆదేశాల మేరకు రోడ్డు విస్తరణ, నిర్మాణ అధికారులకు సహాయ సహకారాలు అందించే క్రమంలో స్థానిక వీఆర్వోతో కలసి అతని ఇంటిని పరిశీలించాం. రోడ్డు పనులకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– జి.వెంకటేశ్వరావు, తహసీల్దార్
సర్వే సమయంలో ఇల్లు లేదు..
కనకాపురంలో రోడ్డు సర్వే చేసిన సమయంలో ఓర్సు శ్రీను ఇంటి ప్రదేశం ఖాళీగా ఉంది. అనం తరమే అక్కడ నష్టపరిహారం కోసం ఇంటి నిర్మా ణం చేపట్టారు. గతంలో పూరిగుడిసె ఉండేదని కొంతకాలం క్రితం తొలగించినట్టు బాధితుడు చెబుతున్నాడు. ఇప్పటి వరకు రోడ్డు విస్తరణలో సుమారు 400 మందికి రూ.37 కోట్లు నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించింది.
– కాజా, ఎన్‌హెచ్ ఏఈ