Share News

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.207 తగ్గింపు

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:28 AM

గ్యాస్‌ సిలిండర్‌ ధరలు చమురుసంస్థలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హోటల్స్‌, కేటరింగ్‌, చిరు వ్యాపారులకు పెద్ద ఊరట లభించింది.

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.207 తగ్గింపు

హోటల్స్‌, చిరు వ్యాపారులకు ఊరట

గణపవరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ సిలిండర్‌ ధరలు చమురుసంస్థలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హోటల్స్‌, కేటరింగ్‌, చిరు వ్యాపారులకు పెద్ద ఊరట లభించింది. తగ్గించిన ధరలు ఆదివారం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2955 ఉండగా సిలిండర్‌పై రూ.207 తగ్గింది ప్రస్తుతం రూ.2748లకు సిలిండర్‌ లభిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5400 కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ధర తగ్గడంతో రానున ్న రోజుల్లో మరిన్ని వ్యాపార సంస్థలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అమెరికా, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌, పెట్రోల్‌ సరఫరా సరిగా లేకపోవడంతో జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు దొరక్కపోవడంతో జిల్లాలో అధికశాతం హోటల్స్‌, కేటరింగ్‌ యాజమానులు తమ వ్యాపారాలు తాత్కాలికంగా నిలిపి వేశారు. కొంతమంది కట్టెల పొయ్యలను ఆశ్రయించారు. చాలా మంది హోటల్‌ యాజమానులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. కొంతమంది ధరలు పెంచారు. యుద్ధ సమయంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ బ్లాక్‌లో రూ.4500 నుంచి 4 వేల వరకు విక్ర యించారు. గృహ వినియోగ దారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కంపెనీలు 45 రోజులు దాటిన తరువాతే సరఫరా చేయడంతో బ్లాక్‌లో విక్రయాలు పెరిగాయి. రూ.2 వేల నుంచి 3 వేల వరకు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించారు. ప్రస్తుతం చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో హోటల్స్‌, కేటరింగ్‌ యాజ మానులకు, చిరువ్యాపారులకు భారీ ఊరట లభించింది.

Updated Date - Aug 03 , 2026 | 12:28 AM