Share News

ఏలూరులో వాయు కాలుష్యం నియంత్రణ భేష్‌..

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:53 AM

ఏలూరు నగరం లో వాయు కాలుష్యం తగ్గించడంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఇతర ప్రజా ప్రతినిధులు బ్రహ్మాండంగా పని చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

ఏలూరులో వాయు కాలుష్యం నియంత్రణ భేష్‌..
సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌

కలెక్టర్‌, ఎమ్మెల్యేలు బాగా పనిచేశారు.. సీఎం చంద్రబాబు ప్రశంస

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో జిల్లాకు 4వ ర్యాంకు

వివిధ రంగాల్లో జిల్లా పురోగతి

సంక్షేమ పథకాల్లో జోష్‌

ముగిసిన కలెక్టర్ల సదస్సు

ఏలూరు,సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి):ఏలూరు నగరం లో వాయు కాలుష్యం తగ్గించడంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఇతర ప్రజా ప్రతినిధులు బ్రహ్మాండంగా పని చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రాష్ట్ర సచి వాలయంలో శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సు రెండో రోజు మున్సిపల్‌శాఖ పనితీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇటీవల వాయు కాలుష్య కారకాల నిరో ధంలో పలు అవార్డుల పొందిన నగరాల తీరును ఆయన ఆరా తీశారు. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో జిల్లా 4వ ర్యాంకులో నిలవడంపై ఆయన అభినందిం చారు. ఏలూరు నగరంలో ఎన్‌క్యాప్‌ నిధులతో కాలుష్య కారకాల తగ్గిం పునకు చర్యలు తీసుకున్నామని పురపాలశాఖ మంత్రి నారాయణ వివరించారు. ‘ఏలూరు ఒకప్పుడు 31వ స్థానంలో ఉండేది. 27వ స్థానాలు పైకి ఎగబాకడం మామూలు విషయం కాదు. అక్కడ కలెక్టర్‌, ఎమ్మెల్యేలు బాగా పనిచేశారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’నంటూ అందరితో సీఎం చప్పట్లు కొట్టించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు, ఇతర సంక్షేమ పథకాలపై సాగిన సమీక్షలో కలెక్టర్‌ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కిశోర్‌ హాజరయ్యారు.

వివిధ రంగాల్లో అద్భుత పురోగతి

జిల్లా వివిధ రంగాల్లో అద్భుత పురోగతి చాటింది. అక్షర ఆంధ్ర రిజిస్ర్టేషన్‌లో ప్రథమ ర్యాంకును వశం చేసుకుంది. పదో తరగతి విద్యా ప్రమాణాల పెంపులో ఐదో ర్యాంకు, వసతి గృహాల్లో ప్లాంటేషన్‌లో 88 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానం, పీజీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌ ఆడిట్‌ రేటింగ్‌లో 95 శాతంతో ఐదో స్థానం వశం చేసుకుంది.

సూపర్‌ సిక్స్‌.. కొన్నింటిలో అదుర్స్‌

ఏడాది కాలంగా స్ర్తీశక్తి పథకంలో ఉచిత బస్సుల్లో ఓవరాల్‌గా 2 లక్షల 33 వేల 38 మంది మహిళలు ప్రయాణాలు చేశారు. దివ్యాంగశక్తి పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రారంభిం చగా, గత ఆగస్టు నెలాఖరుకు ఏలూరు లో 1.29 లక్షల మంది ప్రయాణాలు చేశారు. జిల్లాలో ఆటోడ్రైవర్‌ సేవలో పథకం కింద 10,655 మంది లబ్ధి పొందారు. కాగా ఎస్సీ జనాభా ఉన్న జిల్లాల్లో ఏలూరు 4.51 లక్షలతో నాల్గో స్థానంలో ఎస్టీ జనాభాలో 1.20 లక్షల మందితో ఏడో స్థానంలో ఉంది.

సంక్షేమం.. జోష్‌

ఇంటి పైకప్పుపై సోలార్‌ అమరికలో ఏలూరు నాలుగో స్థానంలో నిలిచింది. 1.52 లక్షల మంది అమర్చుకు న్నారు. అనంత అరణ్య పథకంలో అటవీ ప్రాంతంలో 20,313 మొక్కలు నాటాలని లక్ష్యం కాగా 17,875 మొక్కలు నాటి 88.0 శాతంతో రెండో స్థానంలో నిలిచిం ది.గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహా యక సంఘాలకు చెందిన 34,500 మంది సభ్యులకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు ఐదు వరకు రూ.604 కోట్లు రుణాలను 73.01 శాతం అందించి 17వస్థానంలో, అర్బన్‌ ప్రాంతాల్లో ఏలూరు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలి చింది. 3,666 మందికి 509.87 కోట్లు లక్ష్యం కాగా 687 మందికి 119.16 కోట్ల రుణాలను అందించి 23.37 శాతంతో ప్రథమ స్థానం వశం చేసుకుంది. మహిళా పారిశ్రామికవేత్తలను సిద్ధం చేసే క్రమంలో 20,576 మంది సభ్యులను గుర్తించి రూ.213,45 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 6,506 మందికి రూ.110.92 కోట్లను అందించారు. పీఎంశ్రీ పాఠశా లల్లో నిధుల వినియోగంలో జిల్లా 12.32 శాతం నమోదుతో 14వ స్థానంలో నిలిచింది. 37 పాఠశాలలకు రూ.2.45 కోట్ల 54 వేలు విడుదల చేయగా, రూ.2.23 కోట్ల 19 వేలు ఖర్చు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్ర. రాష్ట్ర శిక్షణల్లో భాగంగా యువతకు పీఎంకేవీవై కింద 210 మందికి, పీఎం విశ్వకర్మ కింద 2,211 మందికి శిక్షణ ఇచ్చి 1,549 మంది వివిధ టూల్‌ కిట్లు పంపిణీ చేశారు. యువతకు ఏడు జాబ్‌ మేళాల ద్వారా 88 మంది ఎంపిక లక్ష్యం కాగా, 76 మందికి ఉద్యోగాలను కల్పించి 86.4 శాతం జిల్లా ప్రగతి సాధించింది. కౌశలం కింద వర్క్‌ఫ్రం హోమ్‌ కింద నాన్‌ స్కిల్డ్‌ 2105 మందిని, 7,379 మంది ఐటీఐ, డిప్లమో చదివిన వారిని గుర్తించారు. అక్షరాంధ్ర సర్వే కార్యక్ర మంలో భాగంగా జిల్లాలో 22 లక్షల 59 వేల 069 మంది జనాభా ఉండగా 3,03,130 నిరక్షరాస్యులుగా తేల్చారు. పీ–4లో భాగంగా 96 మందిని బంగారు కుటుంబాలను 52.72 మార్గదర్శకులకు దత్తత ఇచ్చారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌లో ఈ ఏడాది మే నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 39,917 మంది వినియోగించుకున్నారు. పీజీఆర్‌ఎస్‌ వినతుల్లో జూన్‌ ఆరు నుంచి సెప్టెంబరు ఆరు వరకు 7,130 మంది వినతులు ఇవ్వగా 4,265 పరిష్కారం కాగా ఇంకా 2,865 పెండింగ్‌లో ఉన్నాయి. పాజిటివ్‌ శాతం 95 శాతం నమోదైంది. నెగిటివ్‌ 5 శాతం నమోదైంది.స్కూల్‌ సేఫ్టీ ఆడిట్‌ రిపోర్టు ప్రకారం 1,749 పాఠశాలలకు గాను 1,722 సేఫ్టీ ఆడిట్‌ రిపోర్టు సమర్పించగా, ఇందులో భవనాల పరంగా 1,076 మెరుగ్గా ఉన్నాయని, 44 స్కూల్స్‌ ఫిట్‌గా లేవని తేలింది. 84 పాఠశాలల్లో గదులు ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు తేల్చారు.

కలెక్టర్‌ పనితీరుపై ప్రజల సానుకూల ధృక్పథంలో భాగంగా గత సదస్సులో 75.4 శాతం ఉండగా, ప్రస్తుతం 72.5 శాతం నమోదుతో 2.9 శాతం కలెక్టర్‌ వెనుకబడ్డారు. ప్రజల సంతృప్తిస్థాయి వివిధ పథకాల అమలు జిల్లాలో పనితీరుపై 72.5 బాగుందని, 27.5 బాలేదని తేల్చి చెప్పారు.

Updated Date - Sep 12 , 2026 | 12:53 AM