వ్యవసాయంలో ఏలూరు టాప్
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:24 AM
ఏలూరు జిల్లా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్థూల నికర ఆదాయం (జీవీఏ) టాప్‌వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. గతేడాది నికర ఆదాయంలో రూ.7,248 కోట్లు కాగా ఈ ఏడాది రూ.8,143 కోట్లతో ప్రఽథమస్థానంలో నిలిచింది.
పామాయిల్ విస్తరణ బాగుంది
ఎల్‌నినోను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి
కష్ట సమయంలో మెదడుకు పదును పెట్టాలి
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు
జిల్లా తరపున కలెక్టర్ వెట్రిసెల్వి, మంత్రి కొలుసు హాజరు
ఏలూరు,సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్థూల నికర ఆదాయం (జీవీఏ) టాప్‌వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. గతేడాది నికర ఆదాయంలో రూ.7,248 కోట్లు కాగా ఈ ఏడాది రూ.8,143 కోట్లతో ప్రఽథమస్థానంలో నిలిచింది. ఓవరాల్ గా ప్రగతి సూచికల్లో ఏలూరు 157 ఇండికేటర్స్‌లో 87 పాయింట్లతోను ఏ గ్రేడ్‌ను వశం చేసుకుంది. రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రధానంగా పీజీఆర్ ఎస్, ఆర్టీజీఎస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో నిఽధుల వినియోగం, ఆర్‌డబ్ల్యుఎస్, ఎంఎంస్‌ఎంఈలు, ఎల్‌నినో, సంక్షేమ రంగాలపై ఆరా తీశారు. జిల్లా నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి, మంత్రి కొలుసు పార్థసారఽథి హాజర య్యారు. ‘మీరు ఒక్కరే పనిచేయడం కాదు.. చివరి సిబ్బంది వర కు పనిచేయించినప్పుడు మీలోని నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పీజీఆర్‌ఎస్‌లో వినతులు పరిష్కారం కావాలి. మీ చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూ డదు. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లతో కాలం గడిపితే కుదరదు. పనితీరులో మార్పులు రావాలని, రాష్ట్రంలో తలెత్తినా ఎల్‌నినో ప్రభావం రాబోయే కాలంలో మరిన్ని ఇబ్బందులు తప్పవు.. వాటిని అధిగమించి సాగు, తాగు నీటికి ఇక్కట్లు లేకుండా చూసుకోవాలి’ అని సీఎం చెప్పా రు. పశుగ్రాసానికి కొరత లేకుండా చూసుకోవాలి. ప్రభు త్వ పథకాల్లో ప్రజల సంతృప్తిస్థాయి మరింత మెరుగు పడాలన్నారు. ఇళ్లస్థల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్లు 10 రోజుల్లో ఫొటో డ్యాక్యుమెంట్ సిద్ధం చేసి కలెక్టర్లు సమర్పించాలని ఆదేశించారు. పంటల సాగులో భాగంగా ఏలూ రు జిల్లాలో పామాయిల్ సాగు విస్తరణపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లా ప్రఽథమస్థానంలో ఉంద ని తెలిపారు. రెండో రోజు సూపర్ సిక్స్ పథకాలతో పాటు, శాంతి భద్రతలపై సీఎం సమీక్షిస్తారు. సమావేశానికి కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు జిల్లా ఎస్పీ కిశోర్ పాల్గొనున్నారు.
పాలనలో టాప్.. వ్యవసాయంలో రికార్డు
పరిపాలనాపరమైన 157 కీలక పనితీరు సూచికలలో ఏలూరు జిల్లా 87 స్కోరు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఈఎస్‌జీ ర్యాంకింగ్స్‌లో 90 స్కోరుతో 6వ స్థానంలో నిలిచింది. 2026–27 మొదటి తైమ్రాసికంలో వ్యవ సాయం, అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో జిల్లా రూ.8,183 కోట్ల ఉత్పత్తితో రాష్ట్రంలోనే నంబర్ 1 ర్యాంకును దక్కించుకుంది.
పీఎంజన్‌మన్‌లో భేష్.. పీఎంఏవైలో వెనుకబాటు
గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పీఎం–జన్‌మన్ ఇళ్ల నిర్మాణంలో జిల్లా 73 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అయితే, సాధారణ పీఎంఏవై గృహ నిర్మాణాల్లో మాత్రం గ్రౌండ్ అయిన ఇళ్లలో కేవలం 60 శాతం మాత్రమే పూర్తి చేసి రాష్ట్రంలో 24వ స్థానానికి పడిపోయింది. ఇంకా 34,920 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
పరిశ్రమలు, పీఎంఎఫ్‌ఎంఈలో జాప్యం
మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మంజూరులో 192 యూనిట్ల లక్ష్యానికి కేవలం 19 యూనిట్లే (9.90 శాతం) పూర్తి చేసి 23వ స్థా నంలో నిలిచింది. ఏపీఐఐసీకి సంబంధించి సెక్షన్ 22ఎ డీ–నోటిఫి కేషన్‌లో పురోగతి శూన్యం కాగా, సీడ్ డిపార్ట్‌మెంట్ భూముల సమస్య కారణంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల పనుల్లో జాప్యం నెలకొంది.