స్ర్తీ శక్తిలో సమస్యలుంటే చెప్పండి
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:06 AM
‘స్ర్తీ శక్తి పథకాన్ని మహి ళలు సద్విని యోగం చేసు కోండి.. ఏమైనా ప్రయాణాల్లో సమస్యలుంటే వెంటనే ఆర్టీసీ అధికారులు, నా దృష్టికి తీసుకురండి’ అని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు.
ఆర్టీసీ ఉచిత ప్రయాణాలపై కలెక్టర్ ఆరా
ఏలూరు, జనవరి 3(ఆంధ్ర జ్యోతి): ‘స్ర్తీ శక్తి పథకాన్ని మహి ళలు సద్విని యోగం చేసు కోండి.. ఏమైనా ప్రయాణాల్లో సమస్యలుంటే వెంటనే ఆర్టీసీ అధికారులు, నా దృష్టికి తీసుకురండి’ అని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. ఏలూరు కొత్తబస్డాండ్‌ను శని వారం ఆకస్మికంగా తనిఖీ చేసి మహిళా ప్రయాణికులను ఉచిత బస్సు ప్రయాణాలపై ఆరా తీశారు. డ్రైవర్, కండ క్టర్ ప్రవర్తన ఎలా ఉంది? మర్యాదగా ప్రవర్తిస్తున్నారా... అని ప్రశ్నించారు. మర్యాదగానే ఉంటున్నారని, బస్సుల సంఖ్యను పెంచాలని మహిళలు కోరారు. రద్దీ సమయాల్లో అదనపు బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ డీపీటీవో షేక్ షబ్నంను ఆదేశించారు. డిపో మేనేజర్ వాణి, ఏఎంటీ రజిని, బస్టాండ్ సూపర్ వైజర్ కుమారి, పీఆర్వో నరసింహం పాల్గొన్నారు.