నివేదికలు సిద్ధం చేయండి
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:30 AM
ప్రభుత్వపరంగా అందే రాయితీ లు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వివిధ రకాల బీమా పఽథకాల ద్వారా రైతులకు మేలు జరిగేందుకు ఈ–పంట సూపర్‌వైజర్ చెక్ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్య మని, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి
పెదవేగి, మార్చి 4(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వపరంగా అందే రాయితీ లు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వివిధ రకాల బీమా పఽథకాల ద్వారా రైతులకు మేలు జరిగేందుకు ఈ–పంట సూపర్‌వైజర్ చెక్ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్య మని, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో వరి పొలాల్లో ఈ– పంట సూపర్‌వైజర్ చెక్ రికార్డులను బుధవారం క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్‌లో ఉత్పత్తి స్థితిగతులపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్ బాషా, సహాయ సంచాలకులు అనిలకుమారి, పెదవేగి తహసీల్దారు ఎస్డీ.భ్రమరాంబ, గ్రామ సర్పంచ్ గుంజా క్రీస్తుమణి మధుబాబు, ఉప సర్పంచ్ చింతమనేని శివగోపాల్, వ్యవసా యాధికారి సీహెచ్.శ్రీనివాస్, నీటిసంఘం అధ్యక్షుడు సత్యనారా యణ, రెవెన్యూ, వ్యవసాయ. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.