పారదర్శకంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ..
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:45 AM
పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు.
అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు
చల్లావారిగూడెం కాలనీని పరిశీలించిన కలెక్టర్ వెట్రిసెల్వి
జంగారెడ్డిగూడెం రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి):పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లావారిగూడెంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో బుధవారం కలెక్టర్ పర్యటించారు. కాలనీలో ఇళ్లు, మౌలిక సదుపాయా లు నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులందరినీ దశలవారీగా డిసెంబరు లోగా కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మళ్లీ నెల రోజుల్లో ఇక్కడకు వస్తానని అప్పటికి దాదాపు పరిష్కారం అయ్యే సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తా మని హెచ్చరించారు. ఓ ఇంటి గడప పైనే గంటసేపు కూర్చుని నిర్వాసితుల గోడు విన్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారు లతో ఫోన్‌లో మాట్లాడారు. వేలేరు పాడు మండలానికి చెందిన కాపు లాలయ్య, లలితా దంపతులు కలెక్టర్‌ను కలిసి తమకి 2025లో ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ మొత్తం రూ.6.86 లక్షలు మంజూరు చేశారని, కానీ ఆర్‌అండ్‌ఆర్ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శ్రీకాకుళంకు చెందిన వేరే అకౌంట్‌కి పరిహారం జమ అయిందన్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. కలెక్టర్ స్పంది స్తూ నెల రోజుల్లోగా బాధితులకు ప్యాకేజీ మొత్తాన్ని అందించాలని, లేనిపక్షంలో ఆర్‌అండ్‌ఆర్ అధికారి,ఐటీడీఏ పీవో రాములు నాయక్ జీతం నుంచి, పొరపాటు చేసిన సంబంధిత సిబ్బంది జీతం నుంచి చెల్లిం చాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పీవోను ఆదేశిం చారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వీధి లైట్లు వెలగడం లేదని, పట్టాలు ఇవ్వకపోవడంతో ఇంటి మీటర్లపై విజిలెన్స్ అధికారులు జరిమానాలు విఽధించారని నిర్వాసితులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఎస్‌ఈతో మాట్లాడి గురువారం కాలనీలో పర్యటించి సమస్యలను పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తమకు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో డీఆర్‌డీఏ, వెలుగు ఉన్నతాధికారులతో మాట్లాడి శుక్రవారం కాలనీలో ప్రత్యేక ఉపాధి కల్పన శిబిరం ఏర్పాటు చేయాలని, ముద్ర లోన్‌లు, ఆసక్తి ఉన్న వారికి కంప్యూ టర్, డ్రైవింగ్, కుట్టుమిషన్‌లపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. కాలనీలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని కాలనీకి దూరంగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. అనంతరం కారులో కాలనీ మొత్తం పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఆర్డీవో రమణ, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, ఈఈ కేవీవీఎస్‌ఎస్ ప్రసాద్, తహసీల్దార్ స్లీవజోజి, తదితరులు పాల్గొన్నారు.