రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:14 AM
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను ప్రమాదరహిత జిల్లాలుగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరికి రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్‌లు కె.వెట్రి సెల్వి, నాగరాణి తెలిపారు.
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు వెట్రి సెల్వి, నాగరాణి
ఏలూరు క్రైం/భీమవరం టౌన్, జనవరి 1 (ఆంధ్ర జ్యోతి): ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను ప్రమాదరహిత జిల్లాలుగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరికి రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్‌లు కె.వెట్రి సెల్వి, నాగరాణి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌లో గురువారం 37వ జాతీయ రహదారి భద్రతా మాసో త్సవాలను కలెక్టర్ ప్రారంభించి, సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి కలెక్టర్ నాగరాణి పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా కలెక్టరేట్‌లలో వారు మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. రోడ్డు ప్రమాదాల ద్వారా ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఎందరో క్షతగాత్రులవుతున్నారన్నారు. ఎన్నో కుటుం బాలు చిద్రమవుతున్నాయన్నారు. రహ దారి నియ మాలపై సరైన అవగాహన లేకపోవడం, హెల్మెట్, సీటుబెల్టు ధరిం చకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాలతో రహదారి ప్రమాదాలు జరుగుతున్నా యన్నారు. రహదారి నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించి సురక్షిత ప్రయాణం చేసేలా ట్రాఫిక్ నియ మాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో యువతకు అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. ఏలూరు జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ కేఎస్‌ఎంవీ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను జనవరి ఒకటి నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాంతాలు, పాఠశాలల్లో రహదారి భద్రత, నిబంధనలపై అవగా హన కల్పిస్తామన్నారు. ఏలూరులో ఆర్టీవో శేఖర్, ఎంవీఐలు భీమారావు, విఠల్, జగదీశ్, స్వామి, ప్రజ్ఞ, కల్యాణి పాల్గొన్నారు. భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా రవాణాశాఖ అఽధికారి కేఎస్‌ఎంవీ కృష్ణా రావు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.