యోగాను జీవనశైలిగా మార్చుకోవాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:35 AM
యోగా ఒక ఉత్తమ జీవనశైలి అని, విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు రూరల్, జూన్ 17(ఆంధ్రజ్యోతి) : యోగా ఒక ఉత్తమ జీవనశైలి అని, విద్యార్థి దశ నుంచే ప్రతిఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక యోగాలో జేసీ ఎం.జెఅభిషేక్‌గౌడతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుప డుతుందని, భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాను భావితరాలకు అందించాలని సూచించారు. ఈనెల 19న పట్టిసీమలో జరిగే భారీ యోగా కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. డీఆర్‌వో దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈవో జగదాంబ, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, డీపీవో జి.మల్లికా ర్జునరావు, జిల్లా ఆయుష్ అధికారి బి.భాస్కర్, కమిషనర్ ఎ. భానుప్రతాప్, డీఈవో వెంకటలక్ష్మమ్మ, తహసీల్దార్ గాయత్రీదేవి, మోప్మా పీడీ రాజబాబు, ఇన్‌చార్జి డీఎస్‌వో ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.