Share News

1 నుంచి దాళ్వాకు నాట్లు

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:55 PM

దాళ్వా పంటకు నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ నాగరాణి అధికారులను ఆదేశించారు.

1 నుంచి దాళ్వాకు నాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగరాణి, జేసీ కల్పశ్రీ

నీటి పారుదల సలహా మండలి సమావేశంలో కలెక్టర్‌ నాగరాణి

భీమవరం రూరల్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): దాళ్వా పంటకు నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో రెండు లక్షల 28 వేల లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు ఉద్యాన పంటలకు నీరు అందిస్తామన్నారు. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి నాట్లు పూర్తి చేసేలా ప్రణాళిక చేయాలని, జనవరి చివరి వారం నుంచి వారబంది అమలు చేస్తామని చెప్పారు. ఈ నెలలోనే అనుకూల ప్రాంతాల్లో విత్తనాలు అందించాలని సూచించారు. కాల్వ లు, డ్రైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఈఈ రమేశ్‌, వ్యవసాయాధికారిణి సునీత, డ్రైనేజీ ఈఈ, డీఈలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ముందస్తు అప్రమత్తత

ఈ నెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికతో అన్ని శాఖలు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి గూగుల్‌ మీట్‌ ద్వారా రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌, విద్యుత్‌, వైద్య, వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ అధి కారులతో సమీక్షించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, లంక గ్రామాల్లో వృద్ధులు, గర్భిణీలు, బాలిం తలు, చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. కాల్వలు, డ్రైనేజీల్లో పూడిక తొలగించి, నీరు నిలిచే చోట మోటార్లు సిద్ధంగా ఉంచాలన్నారు. రహదారులు, విద్యుత్‌, తాగునీటికి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, వర్షాలు తగ్గాక పారిశుద్ధ్యం, బ్లీచింగ్‌ చేపట్టాలని ఆదేశిం చారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ కె.ఆర్‌. కల్పశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 11:55 PM