పీఎం సూర్యఘర్ వేగవంతం చెయ్యాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:33 AM
పీఎం సూర్య ఘర్ ఎస్సీ, ఎస్టీ యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ పథకం అమలును మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగ రాణి అన్నారు.
విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష
భీమవరం టౌన్, జూలై 13(ఆంధ్రజ్యోతి): పీఎం సూర్య ఘర్ ఎస్సీ, ఎస్టీ యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ పథకం అమలును మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగ రాణి అన్నారు.సోమవారం కలెక్టరేట్‌లో ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.ఉషారాణి,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఈ పథకం ద్వారా కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల వరకు సామర్థ్యం గల సౌర విద్యుత్ (సోలార్) ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్లలో మరింత మెరుగుపరచాలని అధి కారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వర కు 8,705 మంది విద్యుత్ వినియోగదారులు మొత్తం 27.66 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
పీజీఆర్‌ఎస్‌లో 187 అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవె న్యూ క్లినిక్‌లలో అందుతున్న ప్రతి ఫిర్యాదు ను నిర్దేశిత గడువు లోపల పరిష్కరించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ సమస్యలపై 187 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌లో 48 దరఖా స్తులు స్వీకరించారు. జేసీ కల్పశ్రీ, ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి పి.ప్రభాకర్, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో10 అర్జీలు
భీమవరం క్రైం, జూలై 13(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు 10 అర్జీలను స్వీకరించారు. వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.