Share News

బడికి వెళ్లండి..

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:26 AM

పులిరాముడు గూడెం, రెడ్డికోపల్లె గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలబా లికల పాఠశాలలను పాత పద్ధతిలో కొనసాగించేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతానని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి హామీ ఇచ్చారు.

బడికి వెళ్లండి..
పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

పాత పద్ధతిలోనే ఆశ్రమ పాఠశాలలు..

ప్రభుత్వానికి నివేదిస్తా : కలెక్టర్‌

అంగీకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు

బుట్టాయగూడెం, జూలై 8(ఆంధ్రజ్యోతి): పులిరాముడు గూడెం, రెడ్డికోపల్లె గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలబా లికల పాఠశాలలను పాత పద్ధతిలో కొనసాగించేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతానని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి హామీ ఇచ్చారు. దీనితో 27 రోజులుగా నెలకొన్న ప్రతిష్టం భనకు తెరపడింది. ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌, ఆర్టీసీ విజయవాడ జోనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు తో కలిసి కమిటీ సభ్యులు బుధవారం కలెక్టర్‌ను కలిసి పాఠశాలల పరిస్థితి వివరించారు. పాత పద్ధతిలో పాఠశాలలను కొనసాగించేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతానని, పిల్లలను బడులకు పంపించాలని కలెక్టర్‌ చెప్పడంతో సభ్యులు అంగీకరించారు. పాఠశాలలను కుదించడం వలన కొండరెడ్డి తెగకు చెందిన పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుందని, పాత పద్ధతిలోనే పాఠ శాలలను కొనసాగించాలని పీఆర్‌.గూడెం, రెడ్డికోపల్లె ప్రాంతాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలను పాత పద్ధతిలో నడపాలని ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ కమి షన్‌ చైర్మన్లు, ట్రైకార్‌ చైర్మన్‌, అధికారులకు కమిటీ సభ్యులు వినతులు అందజేశారు. జూన్‌ 12న పాఠశాల లు తెరిచినా పీఆర్‌ గూడెం, రెడ్డికోపల్లె ఆశ్రమ పాఠశాల విద్యార్థులు బుధవారం వరకు హాజరు కాలేదు. కలెక్టర్‌ హామీతో గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకోను న్నాయి. కలెక్టర్‌ను కలిసినవారిలో యు.ఏసుబాబు, బట్టు సురేష్‌, ఎం.రమేష్‌, ఎం.వెంకటేశ్వరావు, టి.నాగేశ్వరావు, మడకం పాపమ్మ, పొడియం వసంత, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు ఉన్నారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలి

పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను పాత పద్దతిలోనే కొనసాగించాలని కోరుతూ బుధవారం గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, తల్లిదండ్రు లు పాఠశాల వద్ద నిరసన కొనసాగించారు. కొండరెడ్డి గిరిజన పిల్లలకు విద్యను దూరం చేయ వద్దంటే అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. 8, 9, 10 తరగ తులు కొనసాగించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు.

Updated Date - Jul 09 , 2026 | 12:26 AM