Share News

చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:19 AM

నరసాపురంలో చెత్త సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చేస్తామని విప్‌ నాయకర్‌ అన్నారు.

చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం
గోదావరిలో చెత్తను తొలగిస్తున్న విప్‌ నాయకర్‌, కలెక్టర్‌ నాగరాణి

కలెక్టర్‌ నాగరాణి.. వలంథర్‌ రేవులో స్వచ్ఛ భారత్‌

నరసాపురం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): నరసాపురంలో చెత్త సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చేస్తామని విప్‌ నాయకర్‌ అన్నారు. శనివారం పట్టణంలో జిల్లా కలెక్టర్‌ నాగరాణితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వలంథర్‌రేవులో చెత్తా, చెదారాన్ని తొలగించి, పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఆనంతరం గోదావరిలో చెత్తను తొలగించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ మానవహారం నిర్వహించారు. నాయకర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం వల్ల చెత్త పెద్ద సమస్యగా మారింద న్నారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తే ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చున్నారు. కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ నదీ జలాల్లో చెత్తా, చెదారం వేసి కలుషితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం గోదావరి మాతకు జల హారతి ఇచ్చారు. టీడీపీ ఇన్‌చార్జి రామరాజు, మత్స్యకార అభివృద్ధి చైర్మన్‌ కొల్లు పెద్దిరాజు, ఆర్డీవో దాసిరాజు, తహసీల్దార్‌ సత్యనారాయణ, కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ జక్కం శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:19 AM