Share News

కలెక్టరేట్‌కు 85 మందే..

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:27 AM

కలెక్టరేట్‌లో వివిధ విభాగాల రేషనలైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

 కలెక్టరేట్‌కు 85 మందే..

రేషనలైజేషన్‌ చేసేందుకు కసరత్తు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు

ఏలూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి):కలెక్టరేట్‌లో వివిధ విభాగాల రేషనలైజేషన్‌ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2022లో జిల్లాల విభజన నేపథ్యంలో వివిధ విభాగాల్లో అఽధికారు లను కొత్తజిల్లాకు అసంబద్ధంగా సర్దుబాటు చేశారు. దీనివల్ల పరిపాలనలో ఇబ్బంది, సిబ్బం ది కొరత వల్ల కొన్ని విభాగాలపై పనిభారం పెరిగింది. అప్పట్లో ఏ నుంచి హెచ్‌ వరకు 12 సెక్షన్‌లుగా ఉండే కలెక్టరేట్‌ను వైసీపీ హయాం లో 4 సెక్షన్లకు కుదించారు. ఏలూరులో ఏబీసీ మూడే సెక్షన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 28 జిల్లాలకు యూనిఫాంగా ఒకే అధికారులు, సిబ్బంది ఉండేలా రేషనలైజేషన్‌ చేయాలని ప్రభుత్వ చీప్‌ సెక్రట్రరీ జి.సాయిప్రసాద్‌ ఆది వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా కలెక్టరేట్‌ పరిధిలో 85 మంది అఽధికారులు, ఉద్యోగులు మాత్రమే పని చేసేలా సర్దుబాటు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ లో జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో, కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌, ల్యాండ్‌రీఫామ్స్‌ ఏవో, 4 సెక్షన్లకు సూపరిండెంట్‌లు, 16 మంది డిప్యూ టీ తహసీల్దార్‌లు, 16 మంది సీనియర్‌ అసి స్టెంట్‌లు, 10 మంది జూనియర్‌ అసి స్టెంట్‌లు, ఒక రికార్డ్‌ అసిస్టెంట్‌, ఒక జమీదార్‌ రెగ్యులర్‌ అపాయింట్‌మెంట్‌గా పని చేస్తారు. 10 మంది కంప్యూటర్‌ ఆపరేటర్‌లు, 4 గురు డ్రైవర్‌లు, 16 మంది ఆఫీస్‌ సబార్డినెట్‌లు, ఇద్దరు వాచ్‌మెన్‌లు తదితర 32 పోస్టులకు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకునే అవకాశం కల్పించారు.

తప్పనున్న పనిభారం

ప్రధానంగా కలక్టరేట్‌లో చాలా వరకు పోస్ట్‌ లు ఖాళీగా ఉండడంతో ఉన్న తక్కువ మందిపై పనిభారం పెరుగుతోంది. కోర్టు కేసులు, ప్రోటో కాల్‌ డ్యూటీ, ఎలక్షన్‌ డ్యూటీ, లా అండ్‌ఆర్టర్‌, పీజీఆర్‌ఎస్‌, విపత్తుల నిర్వహణ, తదితర అంశాల పర్యవేక్షణ కష్టతరంగా మారింది. ఇటీవల ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి కలెక్టరేట్‌లో ఉన్న అరకొర సిబ్బంది పనిభారం మోయలేక పోతున్నారని, ఉద్యోగుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కలక్టరేట్‌లో 85 మంది ఉద్యోగులు, అధికారులు ఉండేలా సర్దుబాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒకవేళ మిగులు సిబ్బంది ఉంటే వారిని పక్క జిల్లాలకు బదిలీ చేయనున్నారు. కాగా ఏలూరుకు అదనంగా డి సెక్షన్‌కు అధికారులను, సిబ్బందిని నియామకం చేపట్టనున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 12:27 AM