స్వచ్ఛ ఏలూరు జిల్లా సాధనలో భాగస్వాములు కండి..
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:02 AM
ప్రజా భాగస్వామ్యం తోనే స్వచ్ఛ ఏలూరు జిల్లాను సాధించగలమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలు, పంచాయతీలు, పట్ట ణ స్థానిక సంస్థలకు సంస్థలకు సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల ఆడి టోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ‘స్వచ్ఛాంధ్ర అవా ర్డులు అందజేశారు.
కలెక్టర్ వెట్రిసెల్వి .. స్వచ్ఛాంధ్ర అవార్డుల అందజేత
ఏలూరు రూరల్, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజా భాగస్వామ్యం తోనే స్వచ్ఛ ఏలూరు జిల్లాను సాధించగలమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలు, పంచాయతీలు, పట్ట ణ స్థానిక సంస్థలకు సంస్థలకు సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల ఆడి టోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ‘స్వచ్ఛాంధ్ర అవా ర్డులు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్ర తను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా చేసుకోవాలని, తడి–పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధనకు కృషి చేయాలన్నారు. జేసీ డా.ఎం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.