అభ్యంతరాలు లేని ఓటర్ల జాబితా రూపొందించాలి
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:39 AM
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(సర్)– 2026 ప్రక్రియ జూలై 4 వరకు కొనసాగుతుం దని, ప్రతి బూత్‌లెవెల్ అధికారి తమ పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అభ్యంతరాలు లేని ఓటర్ల జాబితా రూపొందిం చాలని కలెక్టర్ వెట్రిసెల్వి అఽధికారులకు సూచించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి
లింగపాలెం, జూలై 22(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(సర్)– 2026 ప్రక్రియ జూలై 4 వరకు కొనసాగుతుం దని, ప్రతి బూత్‌లెవెల్ అధికారి తమ పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అభ్యంతరాలు లేని ఓటర్ల జాబితా రూపొందిం చాలని కలెక్టర్ వెట్రిసెల్వి అఽధికారులకు సూచించారు. ధర్మాజీ గూడెంలో స్వర్ణగ్రామ సచివాలయంలో అకస్మిక తనిఖీ నిర్వహించి పథకాల అమలు తీరును పరిశీలించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఎల్‌లోలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ పరిధిలో పంట పొలాల వద్ద ఉన్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో కారణం గా అధికనీరు వినియోగించే పంటలను తగ్గించి ఆరుతడి పంటలను ఎంచుకోవాలన్నారు. గ్రామంలోని రామకృష్ణ మెన్యూర్‌డిపోని తనిఖీ చేసి యూరియా, డీఏపీ నిల్వలను, స్టాకు రిజిస్టర్‌లను పరిశీలించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, దివ్యాంగుల పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. టీచర్‌గా మారి 4,5 తరగతుల విద్యార్థులకు పాఠాలను బోధించారు. కొందరు దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్‌లు రావడం లేదని ఆమె దృష్టికి తీసుకురాగా వారికి పెన్షన్‌లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయా కార్యక్రమాల్లో సబ్‌కలెక్టర్ వినూత్న, స్వర్ణ గ్రామ, వార్డు జిల్లా అధికారి వెంకటనాయుడు, డీపీవో మల్లి కార్జునరావు, చింతలపూడి ఈఆర్వో వీవీఎస్ శర్మ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా,తహసీల్దార్ నజీముల్లా షా, ఎంపీడీవో వాణి, ఉద్యానశాఖ అధికారి షాఫియాఫర్హీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.