సకాలంలో సమస్యల పరిష్కారం
ABN , Publish Date - May 30 , 2026 | 12:50 AM
ప్రజల వినతులను పరిశీలించి సకాలంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు ఆదేశించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు
నిడమర్రులో వినతుల స్వీకరణ
భీమడోలు, మే 29 (ఆంధ్రజ్యోతి):ప్రజల వినతులను పరిశీలించి సకాలంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక నెల – ఒక గ్రామం.. నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన నిడమర్రులో కలెక్టర్, ఎమ్మెల్యే రెండోసారి పర్యటించారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో జేసీ అభిషేక్ గౌడ్, ఆర్డీవో కె.లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. గతవారం మొదటి పర్యటనలో మండల పరిధిలోని గ్రామాల ప్రజల నుంచి స్వీకరిం చిన అభివృద్ధి, సంక్షేమం, భూ సంబంధిత, ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను సమీక్షించారు. ప్రజల నుంచి మరిన్ని వినతులను స్వీకరించారు. మండల జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.