ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి : కలెక్టర్
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:55 AM
అంగన్‌వాడీ ప్రీస్కూల్‌లో విద్యా కార్య క్రమాన్ని పూర్తి చేసుకున్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. పోణంగి అంగన్ వాడీ ప్రీస్కూల్‌లో చిన్నారులకు శుక్రవారం అంగన్‌వాడీ గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు అం దించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక టో తరగతిలో చేర్పించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఏలూరు రూరల్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యో తి):అంగన్‌వాడీ ప్రీస్కూల్‌లో విద్యా కార్య క్రమాన్ని పూర్తి చేసుకున్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. పోణంగి అంగన్ వాడీ ప్రీస్కూల్‌లో చిన్నారులకు శుక్రవారం అంగన్‌వాడీ గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు అం దించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక టో తరగతిలో చేర్పించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆరుగురు చిన్నారులను తన కారులో ఎక్కించుకుని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీ ప్రీస్కూల్‌లో విద్యా కార్యక్రమాన్ని విజయ వంతంగా పూర్తి చేసుకున్న 7,480 మందిలో ఇప్పటి వరకు 4,572 మందిని ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించామ న్నారు. ఐసీడీఎస్ పీడీ శారద, డీఈవో వెంక టలక్ష్మమ్మ, సర్వశిక్ష ఏపీసీ డా.పంకజ్‌కుమార్, తహసీల్దార్ గాయత్రీదేవి, ఎంఈవో అరుణ్ కుమార్, సీడీపీవో పద్మావతి పాల్గొన్నారు.