అధికారుల పనితీరు అభినందనీయం : కలెక్టర్
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:26 AM
రెండేళ్లుగా అధికారులు లక్ష్యంతో కట్టుబడి పనిచేస్తున్నారని కలెక్టర్ నాగరాణి అభినందించారు. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఉత్తమ అధికారులకు మెమొంటోలు
భీమవరం టౌన్, ఏప్రిల్ 21(ఆంఽధ్రజ్యోతి): రెండేళ్లుగా అధికారులు లక్ష్యంతో కట్టుబడి పనిచేస్తున్నారని కలెక్టర్ నాగరాణి అభినందించారు. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సివిల్ సర్వెంట్లు తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో కీలకమని కలెక్టర్ చెప్పారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా అధికారులు మరింత సమర్థవంతంగా పని చేయాలన్నారు. వివిధ శాఖల అధికారుల ఉత్తమ పనితీరును గుర్తిస్తూ మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి, నరసాపురం ఆర్డీవో దాసిరాజు, డీఈవో నారాయణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అరుణకుమారి, వెనుక బడిన సంక్షేమ శాఖ అధికారి సూరిబాబు, పరిశ్రమల శాఖ అధికారి మంగపతిరావు, సర్వే అధికారి కె.జాషువా, ఆర్‌అండ్‌బీ అధికారి శ్రీనివాసరావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డీఏం ఇబ్రహీం, డీసీహెచ్‌ఎస్ పి.సూర్య నారాయణ, మత్స్యశాఖ ఏడీ రాజు, దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రామ్‌కుమార్, డివిజన్ మేనేజర్ కిరణ్ కుమార్, కలెక్టరేట్ డీటీ సన్యాసిరావు, ఇరగవరం ఎంపీడీవో శ్రీనివాసరావు, గణపవరం డిప్యూటీ ఎంపీ డీవో సత్యనారాయణ, నరసాపురం మండలం లిఖితపూడి పంచా యతీ కార్యదర్శి శివ కళ్యాణిలకు మెమొంటోలు అందించారు.