ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమే
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:34 AM
ఉచితంగా నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సదుపాయా లపై ప్రజలకు తెలిపి అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు.
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు అర్బన్, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఉచితంగా నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సదుపాయా లపై ప్రజలకు తెలిపి అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా శుక్రవారం ఏలూరు 23వ డివిజన్‌లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆమె బాల బాలికలకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అందజేశారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ఇక్కడి స్కూలులో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న ఎనిమిది మంది విద్యార్థులను అభినం దించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాబోధనతో పాటు క్రీడలకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. డీఈవో వెంకటలక్ష్మమ్మ, ఐసీడీఎస్ పీడీ శారద, తహసీల్దార్ గాయత్రీదేవి పాల్గొన్నారు.