Share News

సీఎం పర్యటనపై కలెక్టర్‌ సమీక్ష

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:42 AM

కలిదిండిలో ఈ నెల 10న నిర్వహించే చంద్రబాబు సభకు ఏర్పాట్లను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌గౌడ, ఎస్పీ కిశోర్‌, ఆర్డీవో లక్ష్మీప్రసన్న శుక్రవా రం పర్యవేక్షించారు.

సీఎం పర్యటనపై కలెక్టర్‌ సమీక్ష
ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌, ఎమ్మెల్యే కామినేని తదితరులు

కలిదిండి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి):కలిదిండిలో ఈ నెల 10న నిర్వహించే చంద్రబాబు సభకు ఏర్పాట్లను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్‌గౌడ, ఎస్పీ కిశోర్‌, ఆర్డీవో లక్ష్మీప్రసన్న శుక్రవా రం పర్యవేక్షించారు. అన్ని శాఖాధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించి ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్‌, ప్రజావే దిక, కేడర్‌ సమావేశం, పాస్‌ పుస్తకాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు లోటు లేకుం డా సురక్షిత తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటు లో ఉండేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీని వాస్‌ మాట్లాడుతూ సీఎం పర్యటన విజయవంతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రజా దర్బార్‌లో 22 ఏ నిషేధిత జాబితా నుంచి విముక్తి కలి గించిన భూములకు రాజముద్రతో కూడిన కొత్త పాస్‌ పుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తామన్నారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ కిశోర్‌ తెలిపారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పార్కింగ్‌ ప్రదేశంలోనే వాహనాలు, బైక్‌లు పెట్టుకోవాలన్నారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుం డా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. రోడ్డుకు ఇరు వైపులా బాంబుడిస్పోజల్‌ టీమ్‌, డాగ్‌ స్వ్కాడ్‌, పార్టీ పోలీసులతో మొత్తం జల్లెడపడుతున్నామన్నారు. విధు ల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరు ఫోటోతో కూడిన పాస్‌ను ధరించాలన్నారు. సీసీ.కెమెరాల పర్యవేక్షణలో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉంటుందన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 12:42 AM