కోఢీ
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:18 AM
నూజివీడు నియోజకవర్గంలో కోడి పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
కోఢీ
సంక్రాంతిని తలపిస్తున్న కోడి పందేలు
మామిడి తోటల్లో బరులు, జూదం!
నూజివీడులో నియోజకవర్గంలో
ఇరు గ్రామాల మధ్య చిచ్చు
పట్టించుకోని అధికారులు
(నూజివీడు – ఆంధ్రజ్యోతి)
నూజివీడు నియోజకవర్గంలో కోడి పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వంద లాది మంది వాహనాలపై కోడిపుంజులతో బరిలో దిగుతారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి దాదా పు నాలుగైదు గంటల పాటు యథేచ్ఛగా పందేలు జోరుగు సాగుతుంది. ఇంత జరిగుతున్నా పట్టించుకునే వారు లేరని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
నూజివీడు మండలం సిద్ధార్ధ నగర్‌లో సంక్రాంతి సంబరాల స్థాయిలో కోడిపందేలు జరగడం బహిరంగ రహస్యం. ఒకరోజు రెండు రోజులు కాదు వరుసగా ఈ కోడి పందేలు సాగుతున్న పోలీస్‌శాఖ మాత్రం ఆవైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. సిద్ధార్థనగర్, ముక్కొల్లుపాడుతో పాటు ఆగిరి పల్లి మండలం నూగొండపల్లి, ఈదర, ముసునూరు మండలం సూరేపల్లిలో పందేలు సాగుతున్నాయి.
నియోజకవర్గంలో జూదాలతో రెండు గ్రామాల మధ్య చిచ్చు రేగింది. ఇటీవల ముసునూరు మండలం రమణక్కపేట, సూర్యపల్లి గ్రామాల మధ్య కోడిపందేలు ఉద్రిక్తతకు దారితీసింది. స్ధానిక పోలీసుల సూచనలు మేరకు పెద్దలు పూనుకూని ఇరు గ్రామాల మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.ఏర్పడింది.
నిఘా వైఫల్యమా.. సహకారమా..?
జూదం నిలువరించాలని మంత్రి కొలుసు పార్థసా రథి హెచ్చరించినా నియోజకవర్గంలో కోడి పందేలు, జూదం సాగడం పోలీసులు నిఘా వైఫల్యమా లేక, అనధికార సహకారమా అనే ఆరోపణలు వస్తున్నాయి. ఆగిరిపల్లి మండలంలో కోడిపందేలపై జిల్లా అధికారుల దాడి చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరు స్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.