బొగ్గు..మంటలు!
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:52 AM
భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యవహారం ముదురుతోంది.వెంకటాపురంలో సోమవారం అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సద స్సును రైతులు, గ్రామస్థులు హాజరు కాకుండా బహిష్కరించారు.
వెంకటాపురంలో అవగాహన సదస్సును బహిష్కరించిన రైతులు, గ్రామస్థులు
చింతలపూడి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యవహారం ముదురుతోంది.వెంకటాపురంలో సోమవారం అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సద స్సును రైతులు, గ్రామస్థులు హాజరు కాకుండా బహిష్కరించారు. ప్రాజెక్టు కోసం భూసేకర ణకు వెళ్లిన రెవెన్యూ సర్వే అధికారులను శనివారం గ్రామస్థులు అడ్డుకున్న విషయం విదితమే. ఈక్రమంలో వెంకటాపురంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద అవగా హన సదస్సుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సదస్సుకు రావాలని ఆయా గ్రామాల్లో అధికా రులు ప్రచారం చేయగా దీనిని వ్యతిరేకిస్తూ సదస్సుకు ఎవ్వరూ వెళ్లవద్దంటూ రైతులు, గ్రామస్థులు ప్రచారం చేయడం గమనార్హం. సాయంత్రం 4 గంటలకు సదస్సు ప్రారంభం కాగా సబ్ కలెక్టర్ వినూత్న, రిలయన్స్ ప్రతిని ధులు, మరో విదేశీనిపుణుడు, తహసీల్దార్ చెల్లన్నదొర, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు వచ్చారు. అయితే రైతులు, గ్రామస్థులు ఎవరూ రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శన మిచ్చాయి. దీనిపై సబ్‌కలెక్టర్ వినూత్నను ప్రశ్నించగా తాము ప్రాజెక్టు అమలు ఎలా జరుగుతుందో రైతులకు, గ్రామస్థులకు వివరిం చడానికి వీడియో ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తే ఎవరూ రాలేదన్నారు. ప్రాజెక్టుకు కావాల్సిన భూమి సేకరణలో కేవలం ఆ రైతులతోనే చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.
రేచర్లలో రైతుల సమావేశం
రేచర్ల బొగ్గుగని ప్రాంత రైతులు రేచర్లలో కంచర్ల శ్రీను అధ్యక్షతన సమావేశమయ్యారు. గ్రామ పరిసర ప్రాంతాలకు బొగ్గు గ్యాసిఫికేషన్ వల్ల జరిగే నష్టానికి, పర్యావరణ ఇబ్బందులకు ప్రభు త్వం ఏ పరిష్కారం చూపుతుందో చెప్పిన తర్వాతే పనులు ప్రారంభించాలని రైతులు తీర్మానిం చారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, మార్కెట్ యార్డు డైరెక్టర్ చిక్కాల శ్రీని వాసరావు, కంచర్ల గురవయ్య, అలపా అప్ప య్య, కొమ్మిన వెంకటేశ్వరరావు, చింతా గోపాల కృష్ణ, అడపా శ్రీను పాల్గొన్నారు.