Share News

బొగ్గు బంగారం

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:53 AM

తెలంగాణ సరిహద్దులోని చింతలపూడి ప్రాంతంలో అపారమైన బొగ్గు నిల్వలు వెలికితీస్తే రాష్ట్రానికి ఇంధన వనరుల కొరత తీరుతుంది.

బొగ్గు బంగారం

రూ.లక్ష కోట్లతో పెట్టుబడి పెట్టనున్న సంస్థ

భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌కు కసరత్తు

చింతలపూడి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి):తెలంగాణ సరిహద్దులోని చింతలపూడి ప్రాంతంలో అపారమైన బొగ్గు నిల్వలు వెలికితీస్తే రాష్ట్రానికి ఇంధన వనరుల కొరత తీరుతుంది. వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి తోపాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తా యి. కేంద్ర గనుల శాఖ ఇటీవల నిర్వహించిన ఈ– వేలంలో చింతలపూడి, రేచర్ల బ్లాక్‌లు రిలయన్స్‌ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయ నుంది. దీనిపై సీఎం చంద్రబాబును సంస్థ ప్రతినిధు లు కలిసి ప్రాజెక్టు వివరాలు, చేపట్టే కార్యాచరణ వివరించారు. 2029 నాటికి పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఇదే జరిగితే రిలయన్స్‌ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ దేశంలో తొలి ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్‌ చోటు చేసుకోనుంది.

చింతలపూడి, రేచర్ల బ్లాక్‌లు..

చింతలపూడి బ్లాక్‌ మూడు వేల ఎకరాల్లో జీ–12 రకం బొగ్గు నిక్షేపాలు 900 మిలియన్‌ టన్నులు, రేచర్ల బ్లాక్‌లో 5,500 ఎకరాల్లో జీ–13 రకం 2,225 మిలియన్‌ టన్నులున్నాయి. 600 నుంచి 1123 మీటర్ల లోతులో తవ్వి తీయడానికి చాలా వ్యయంతోపాటు నిపుణులైన కార్మికులు అవసరం. దీనికి బదులు భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ ద్వారా చేస్తే గ్రామాలు ఖాళీ చేయనక్క ర్లేదు. ప్లాంటుకు భూములిస్తే చాలు.

అండర్‌ గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌

భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ అంటే బొగ్గును బయటకు తీసి కాల్చకుండా భూగర్భంలోనే గ్యాస్‌గా మార్చడం. బొగ్గు పూర్తిగా కాలకుండా సింగాస్‌ అనే ఉపయోగకరమైన గ్యాస్‌గా మారుస్తారు. ఈ సింగాస్‌ ను శుద్ధి చేసి వినియోగంలోకి తెస్తారు. ఇదే జరిగితే దేశంలో ఇది తొలి ప్రాజెక్టుగా నమోదవుతుంది.

2014లోనే శ్రీకారం

రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చింతలపూడి ప్రాంతంలో బొగ్గు నిక్షేపా లను వెలికి తీస్తామని ప్రకటించారు. 2015లో చాట్రా యి మండలం సోమవరం, చింతలపూడి మండలం రాఘవాపురం కేంద్రాలుగా మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీ లిమిటెడ్‌, సౌత్‌ ఫినాకిల్‌ సంస్థలు డ్రిల్లింగ్‌లు జరిపాయి. 120 పాయింట్ల ద్వారా 65 వేల మీటర్ల లోతులో డ్రిల్లింగ్‌ జరిపి 2,224 మిలియన్‌ టన్నుల నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు నిర్ధారించారు. 60 ఏళ్లపాటు ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్‌కు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్టు నిర్ధారించి కేంద్ర గనుల శాఖకు నివేదికలు పంపారు. ఇది గతేడాది 41 బ్లాక్‌లలో బొగ్గు ఉత్పత్తి లేదా గ్యాసిఫికేషన్‌ కోసం బిడ్‌లను ఆహ్వానించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సెస్‌ ఎనర్జి వెంచర్స్‌ ఇండియా సంయుక్తంగా 17 బ్లాక్‌లలో బిడ్‌లు దాఖలు చేశాయి. గత వారం బిడ్‌ లు తెరవగా రిలయన్స్‌ సంస్థ చింతలపూడి, రేచర్ల బ్లాక్‌లను దక్కించుకుంది. రూ.లక్ష కోట్లతో పెట్టుబడి పెట్టి దేశంలో తొలిసారిగా భూగర్భ బొగ్గు గ్యాసిఫి కేషన్‌ ద్వారా గ్యాస్‌ను వెలికితీయనున్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:53 AM