Share News

ముఖ్యమంత్రి వస్తున్నారు

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:29 AM

ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి–మీ హక్కు కార్యక్రమం లో భాగంగా రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం సిద్ధాంతంలో నిర్వహించను న్నారు.

ముఖ్యమంత్రి వస్తున్నారు

నేడు సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ

రైతులతో ముఖాముఖి

పంట భూముల పరిశీలన

వ్యవసాయ స్టాల్స్‌ సందర్శన

పార్టీ శ్రేణులతో సమావేశం

భీమవరం, వాసవి పెనుగొండ, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం సిద్ధాంతంలో నిర్వహించను న్నారు. సీఎం చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమానికి అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ప్రధాన భూపరిపా లన కమిషనర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి, కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీం, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు సీఎం పర్యటన ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌, పార్కింగ్‌, క్యాడర్‌ మీటింగ్‌ వేదిక, రైతుల సమా వేశ ప్రదేశాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

పార్టీ కేడర్‌తో భేటీ

ఆచంట నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సీఎం భేటీ కాను న్నారు. ఈ మేరకు స్థానిక కేడర్‌కు వర్తమానం అందడంతో వారిలో జోష్‌ నెలకొంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు భీమవరం చేరుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సూచించారు. అక్కడి నుంచి అంతా కలిసి సిద్ధాంతం వెళ్లను న్నారు. కూటమి ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, ఎమ్మెల్యేలు అంజిబాబు, ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, బొమ్మిడి నాయకర్‌, టీడీపీ ఇన్‌చార్జిలు తోట సీతారామలక్ష్మి, వలవల బాబ్జి, పొత్తూరి రామరాజు చంద్రబాబుకు హెలిప్యాడ్‌ వద్ద స్వాగతం పలకనున్నారు.

కలెక్టరేట్‌పై స్పందించరూ..

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

భీమవరంలో కలెక్టరేట్‌ నిర్మాణానికి అవకాశం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలెక్టర్‌ నాగరాణి గతంలో ప్రతి పాదించారు. కార్యాలయ భవన నిర్మాణానికి దాతలు ముందుకొస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా తణుకు పర్యటనకు వచ్చినప్పుడు కలెక్టర్‌ ప్రతిపాదన చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్‌పై ప్రభు త్వం నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. కలెక్టరేట్‌ ఎక్కడనే దానిపై మాత్రం భీమవరం ప్రజల్లో ఉత్కంఠ కొన సాగుతోంది. కనీసం పది ఎకరాలు అవసరం అవుతుందని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ప్రతిపాదించారు. వైపీపీ హయాంలో భీమవరం ఏఎంసీ స్థలం కలెక్టరేట్‌ నిర్మాణానికి కేటాయించి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇప్పటికీ అది మనుగడలో ఉండడంతో అక్కడే నిర్మించేలా ఎమ్మెల్యే అంజి బాబు ప్రతిపాదన చేశారు. మరోవైపు జువ్వలపాలెం రోడ్డులో పెద అమిరం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయాలన్న మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భీమవరంలో ఉండాలన్న ఆకాంక్ష నేపథ్యంలో స్థానికంగా అంతా తర్జన భర్జన పడుతున్నారు. ఒక దశలో ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం ఏఎంసీపైనే ఆసక్తి చూపారు. అక్కడ ప్రస్తుతం ఎటువంటి కార్యకలాపాలు లేవు. గోదాములు ఖాళీగా ఉన్నాయి. కేవలం సెస్‌ వసూళ్లకు మాత్రమే ఏఎంసీ పరిమితమైంది. రైతు బంధు పథకాన్ని కూడా ఏ ఒక్కరూ వినియోగించుకోవడం లేదు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించినా వృథాగా పడి ఉన్నాయి. రైతు అతిథి గృహం సైతం నిత్యం మూత పడి ఉంటుంది. రైతులకు వినియోగించుకోని ఏఎంసీని కలెక్టరేట్‌కు ఉపయోగించాలన్న ప్రతిపాదన స్థానికంగా బలపడుతోంది.

అద్దె భవనంలో అవస్థలెన్నో..

ప్రభుత్వం నుంచి కలెక్టరేట్‌పై ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేకపోవడంతో అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణానికి దూరంగా ఉన్న కార్యాలయ గదులు బీటలు వారుతున్నాయి. కనీసం రికార్డులు భద్రపరచుకునే వసతి కూడా లేవు. టేబుళ్లపైనే రికార్డులు ఉంచుకోవాల్సి వస్తోంది. మరోవైపు సర్వే, ప్రణాళిక విభాగం, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, విద్య ఇలా అన్ని విభాగాల సిబ్బంది ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. నూతన కార్యాలయం ఏర్పాటైతేనే కష్టాలు తీరనున్నాయి. భీమవరం ఏఎంసీ వద్దకు బస్సు సౌకర్యం ఉండడంతో ప్రజలకు కూడా రాకపోకలకు అనువుగా ఉంటుంది. జిల్లాలను విభజించి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా నూతన భవనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకు పర్యటనలో ప్రధానంగా కలెక్టరేట్‌ విషయంపైనే కలెక్టర్‌ ప్రస్తావించి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. జిల్లా కేంద్రమైనప్పటికీ భీమవరం రూపు రేఖలు మారలేదంటూ స్థానికులు వాపోతున్నారు. కనీసం కలెక్టరేట్‌ నిర్మాణం జరిగితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయి.

బుడా ఆకాంక్ష నెరవేరేనా..?

పశ్చిమగోదావరి జిల్లాలో పట్టణ కేంద్రాలున్న అసెంబ్లీ నియోజకవర్గాలే అధికం. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. ఇటీవల ప్రభుత్వం 20 మేజర్‌ పంచాయతీలను రూర్బన్‌ పంచాయ తీలుగా గుర్తించింది. జిల్లాలోని అన్ని పట్టణాలు, పల్లెలు ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో ఉన్నా యి. జిల్లాకు ప్రత్యేకంగా భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) ఏర్పాటు చేయాలని జిల్లా నేతలు, ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్‌ నాగరాణి ఈ విషయాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు తణుకు పర్యటనకు వచ్చిన ప్పుడు ప్రస్తావించారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి అను మతి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ప్రతిపాదనలు పంపాలని కోరడంతో స్థానిక మున్సిపల్‌ అధికారులు ప్రతిపాదనలు పంపారు. భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటైతే జిల్లాకు ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటేనే భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యరూపం దాల్చనుంది.

Updated Date - Jun 08 , 2026 | 12:29 AM