Share News

సీఎం పర్యటన వాయిదా

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:58 AM

ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు దెందు లూరు నియోజకవర్గ పర్యటన వాయిదా పడింది.

సీఎం పర్యటన వాయిదా

పెదవేగి,ఏప్రిల్‌ 23(ఆంధ్ర జ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు దెందు లూరు నియోజకవర్గ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి శనివారం గోపన్నపాలెంలో జనాభా నిర్వ హణపై సమావేశం, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్ర సందర్శన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన, ముగ్గురు లబ్ధిదారుల ఇళ్లకు సీఎం స్వయంగా వెళ్లి వారితో ముఖాముఖి, అనంతరం ప్రజావేదికలో పాల్గొ నాల్సి వుంది. అయితే సీఎంకు 25వ తేదీన ముంబైలో అత్యవసర సమావేశం ఉన్నందున దెందులూరు పర్యటన వాయిదా పడిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మరల పర్యటన ఎప్పుడన్నది తెలియాల్సి వుందన్నారు. కాగా గురువారం ఉదయం దెందులూరు, ఏలూరు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిశోర్‌, సీఎం కార్యాలయ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సీఎం పర్యట న ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే సీఎం పర్యటించా ల్సిన ప్రదేశాలతో పాటు రోడ్డుకిరు వైపులా బాంబు డిస్పోజల్‌ టీమ్‌, స్పెషల్‌ పార్టీ పోలీ సులు, డాగ్‌ స్వ్కాడ్‌ బృందాలు గురువారం తనిఖీలు చేశారు.

Updated Date - Apr 24 , 2026 | 12:58 AM