చంద్రోత్సాహం
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:07 AM
భూసమస్యల పరిష్కారంతో కలిదిండిలో సోమవారం జరిగిన సీఎం చంద్రబాబునాయుడి మీ భూమి – మీ హక్కు గ్రామసభ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిం ది.
కలిదిండిలో మీ భూమి – మీ హక్కు సభ సూపర్ సక్సెస్
ఎన్నో ఏళ్ల నాటి భూసమస్య పరిష్కారంతో రైతుల హర్షం
600 మందికి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
ఆక్వా చెరువులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్
కైకలూరు నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వరాలు
మాజీ సైనికులతో ముఖాముఖి.. సమస్యల పరిష్కారం
స్థానిక ఎన్నికపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
కలిదిండి/కైకలూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): భూసమస్యల పరిష్కారంతో కలిదిండిలో సోమవారం జరిగిన సీఎం చంద్రబాబునాయుడి మీ భూమి – మీ హక్కు గ్రామసభ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిం ది. నియోజకవర్గంలో 2600 ఎకరాల 22ఏ భూసమస్య లకు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ కృషితో పరిష్కారం కావడంతో ప్రజల ఆనందాలకు అవధులు లేవు. సీఎం 600 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రజలు, కూటమి పార్టీల శ్రేణులు చూపించిన ఉత్సాహానికి సీఎం మరింత ఆసక్తి కరంగా ప్రసంగించారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపుతామని ఆక్వా రంగం అభివృద్ధికి యూని ట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తామని కైకలూరు నియోజ కవర్గంలో మంచినీటి సమస్యకు రూ.36 కోట్లు మంజూ రు చేస్తూ, రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పిస్తామని సీఎం చేసిన ప్రకటనలతో ప్రజలు జేజేలు కొట్టారు.
మాజీ సైనికుల సమస్యలపై తక్షణ స్పందన
కలిదిండి తహసీల్దార్ కార్యాలయంలో రైతులు, మాజీ సైనికులతో సీఎం చంద్రబాబు సమావేశమై వారి సమస్యలను ఆలకించారు. 22ఏలో తమ భూము లను చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వారు సీఎంకు వివరించారు. తక్షణం స్పందించి వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆర్డీవోకు డీనోటిఫికేషన్ అధికారాలను కల్పించాలని సూ చించారు. వెంటనే రైతులకు, మాజీ సైనికులకు అంబటి జేమ్స్, ముద్రబోయిన వీరకుమారి, పెరుమాళ్ల మరియ మ్మ, సయ్యద్ హుస్సేన్, అనంతనేని శ్రీనివాసరావు, తలారి రామవీరస్వామి, చేకూరి సీతారామయ్య, వేగేశ్న శ్రీరామచంద్రరాజు, కూనపరాజు వెంకటరామచంద్ర రాజు, కొత్తపల్లి నాగరాజు, నగుళ్ల శ్రీనివాసరావు, చేకూరి విశ్వనాధరాజు, పాకనాటి చంద్రయ్య, దుగ్గిరాల సుగుణ కుమారిలకు 1–బీ అడంగళ్ ప్రతులను సీఎం చంద్ర బాబు అందజేశారు. ఉనికిలి, కలిదిండి, వైవాక, గ్రామా ల్లోని 830 కుటుంబాలకు చెందిన 2745 ఎకరాల రైతులకు రిజిస్ర్టేషన్ అయ్యేలా సుగమం చేశారు. సీఎం చంద్రబాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో నూరు శాతం గెలవాలి
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం స్థానాలు గెలవాలి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి కూటమి అభ్యర్థు లను గెలిపించాలి’ అని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. కలిదిండి ఏఎంసీ ఆవరణలో నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి త్వరలోనే పార్టీ ఇన్‌ఛార్జ్‌ని నియమించనున్నట్టు ప్రకటిం చారు. నాయకుడు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉం టుందన్నారు. నియోజకవర్గంలో 21 శాతం మాత్రమే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారని, రాష్ట్రం తో పోలిస్తే ఏడు శాతం వెనుకబడి ఉందన్నారు.
ఆరు గంటలపాటు బిజీబిజీ
సీఎం పర్యటన గంట ఆలస్యంగా సాగినప్పటికి సుమారు ఆరు గంటలపాటు కలిదిండిలోనే బిజీబిజీగా గడిపారు. ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో హెలికాఫ్టర్‌లో
వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మాజీ సైనికులు, రైతులతో ముఖాముఖి మాట్లాడారు. 12.30 గంటలకు మీ భూమి – మీ హక్కు గ్రామసభకు హాజరై గంటన్నరపాటు ప్రసంగించారు. 2.30 గంటలకు భోజనం అనంతరం కొద్దిసేపు ముఖ్య నాయకులతో మాట్లాడారు. 3.30 నుంచి 5.15 గంటల వరకు కార్యకర్తలతో సమావేశమ య్యారు. 5.30 గంటలకు తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుని అమరావతి బయలుదేరారు. సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, రెవెన్యూ కమిషనర్ విజయలక్ష్మీ, కలెక్టర్ వెట్రీ సెల్వీ, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పంచమట్ల ధర్మ రాజు, సొంగా రోషన్‌కుమార్, వెనిగండ్ల రాము, పత్తిపాటి పుల్లారావు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, వీరమల్లునరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, విజయలక్ష్మి, పర్యా టక శాఖ అభివృద్ధి డైరెక్టర్ కొడాలి వినోద్, జిల్లాస్థాయి అధికారులు, పాల్గొన్నారు.
5500 ఎకరాలకు విముక్తి
తమ భూములు 22ఏలో వేలాది మంది రైతులు తీవ్ర మానసిక వేదనను అనుభవిం చారు. ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏలూరు జిల్లాలో 5500 ఎకరాల భూసమస్యకు పరిష్కారం చూపించాం. ఇందులో ఒక్క కైకలూరులోనే 2,600 ఎకరాలు వున్నాయి. కైకలూరు నియోజకర్గానికి జలజీవన్ మిషన్ ద్వారా రూ.36 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఇకపై ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు అందుతుంది.
– నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి
ఏడు నెలలుగా యజ్ఞం
మీభూమి–మీహక్కు భావితరాల ప్రజలకు బంగారు భవిష్యత్తు కల్పిస్తుంది. భూసమస్యల పరిష్కారానికి ఏడు నెలలుగా యజ్ఞం చేస్తు న్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూములను దోచుకునేందుకు ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికి ఉపయోగపడే విధంగా విధానం తీసుకువచ్చాం.కైకలూరులో భూసమస్యల పరిష్కారానికే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రాత్రింబవళ్లు కృషి చేశారు.
– అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
కామినేని కృషి ఫలితమే..
కైకలూరు నియోజకవర్గంలో భూసమస్యలు ఎక్కువ. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి డి.ఫారం పట్టా భూములతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కృషి ఫలితమే 2600 ఎకరాల భూములకు 22ఏ నుంచి విముక్తి లభించింది. గొడ్డలి పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలను కించపరచడమే గాక బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నాలను చూస్తుంటే అసహ్యం వేస్తోంది.
– కొలుసు పార్థసారఽథి, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి
ప్రజల కల సాకారం
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో వున్న భూసమస్యల పరిష్కారంతో కైకలూరు ప్రజల కలలను సీఎం చంద్రబాబు సాకారం చేశారు. ఇప్పటికే ఆక్వా అభివృద్ధికి రూ.55 కోట్లతో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నాం. మరో నాలుగు నిర్మించేందుకు నిధులు కేటాయించాం. నియోజకవర్గంలో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.63 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.54 కోట్లు, సీఎం సహాయ నిధి చెక్కుల ద్వారా రూ.7.44 కోట్లు, పాతాళ భోగేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి రూ.10 కోట్లు ఖర్చు చేశాం.
– డాక్టర్ కామినేని శ్రీనివాస్, కైకలూరు ఎమ్మెల్యే
మీరు ఇంప్రూవ్ కావాలమ్మా
కలెక్టర్ వెట్రిసెల్వికి చంద్రబాబు సూచన
పనితీరు బాగున్న శాఖలకు చప్పట్లు.. బాగాలేని అధికారులకు చురకలు
ఏలూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):నాకు రాజకీయ టీమ్ ఎంత ముఖ్యమో.. అధికారుల టీమ్ అంతే ము ఖ్యం అంటూ జిల్లా పురోభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మీరు మరింత ఇంప్రూవ్ కావాలమ్మా అంటూ కలెక్టర్ కె.వెట్రిసెల్వికి సీఎం చంద్రబాబు సూచించారు. ‘సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలలో మీరు మైనస్‌లో ఉన్నారు. జిల్లాలో మున్సిపాల్టీలు పూర్‌గా ఉన్నాయి. పీజీఆర్‌ఎస్ బాగాలేదు. పోకస్ పెట్టాలి. జవాబుదారీతనం పెరగాలి. పనితీరు మార్చుకోవాలి’ అంటూ కలెక్టర్ చంద్రబాబు హితబోధ చేశారు. కలి దిండి సభలో వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీ క్షించారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్, ఇతర సర్వేల ఆధారంగా లెక్కలతో సహా ఆరా తీశారు. ‘ఏ అధికారి ఎలా పని చేస్తున్నారో రోజూ రిపోర్టులు తెప్పించుకుంటున్నా. ఓవరాల్‌గా ఏలూరు జిల్లా 12 ర్యాంకులో ఉండగా, ఆగస్టు నాటికి కొత్తగా 9 ర్యాంకులో నిలిచింది. కైకలూ రు నియోజకవర్గం మొన్నటి వరకు 71 ర్యాంకులో ఉండగా నేడు 130కి వెళ్లింది. డీఎంహెచ్‌వో శోభ, ఆసుపత్రుల సూపరింటెండెంట్ బేబి కమల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌లైన్ సర్వే, రీ సర్వే రెండు బాగానే చేశారంటూ సర్వే శాఖ డీడీ ఎండీ అన్సారీని, ఆర్వో ఆర్ సర్వేలో ఏలూరు ఆర్డీవో ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న దేవాలయాల నిర్వహణలో ఏసీ కూచిపూడి శ్రీనివాస్‌ను బాగా పనిచేశారంటూ సీఎం చంద్రబాబు చప్పట్టు కొట్టించారు. జిల్లా రిజిస్ర్టార్ కె.శ్రీనివాస్‌ను చంద్రబాబు తమ్ముడని సంబోధిస్తూ మైనస్‌లో ఉన్నావు ఇంప్రూవ్ కావాలి. రాబోయే కాలంలో రికార్డులను మీరే చూడాల్సి ఉంటుంది. ఆర్టీసీ నిర్వహణపై బస్టాండ్‌లు, బస్సుల నిర్వహణలో ఆర్టీసీ డీపీటీవో షేక్ షబ్నమ్‌ను ప్రశ్నిస్తూ బస్సులు బాగానే రన్ చేస్తు న్నావ్.. బస్టాండ్‌లు మెరుగుపర్చాలి. డీటీసీ షేక్ కరీమ్‌తో మాట్లాడుతూ పనే మీకు కొలమానం.. బాగా పనిచేస్తే దండ వేస్తా. లేకపోతే దండన తప్పదన్నారు. ధాన్యం సేకరణ బాగానే చేశారు. దీపం పంపిణీ బాగానే ఉన్నా రేషన్ పంపిణీ బాగాలేదు. ఈ రెండు ఇంప్రూవ్ చేసుకోవాలని పౌ రసరఫరాలశాఖ అధికారులను సీఎం కోరారు. ఆడబిడ్డలకు నాలుగు నెలలు కొకమారు ఒక సిలెండర్ ఖర్చు త్వరలో మహిళల ఖాతాలో వేస్తామంటూ ప్రకటించారు. ఫైర్ ఎన్‌వోసీలు ప్లస్‌లోకి రావడం మంచిదంటూ ఫైర్ ఆఫీసర్‌ను సీఎం అభినందించారు. ఫైల్స్ కాల్స్‌ను సరిగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయన్నారు. గంజాయ్, మహిళలపై దాడుల నిరో ధంలో ఎస్పీ కిశోర్, సిబ్బందిని అభినందిస్తున్నా. ఇది ఇలానే కొనసాగిస్తూ లా అండ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేయాలి. ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీలు నిర్వహణ, పౌష్టికాహారం పంపిణీలో అన్ని అంశాల్లో ప్లస్‌లో ఉన్నారు. ఎలా బాగా చేశావో చె ప్పాలని పీడీ శారదను సీఎం ఆదేశించగా, ఆమె వివరిస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు అందరికి అవగాహన కల్పించడం వల్ల సాధ్యమైందన్నారు. యూరియా, విత్తనాల పంపిణీలో వ్యవసాయ శాఖ వెనుకబడిందన్నారు. బీసీ వెల్ఫేర్ ఇన్‌చార్జ్ రెండు శాఖలు బెటర్‌గా ఉన్నా గ్రామ సచివాలయాలు, హౌసింగ్ శాఖలు పాజిటివ్‌గా ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ గత నెల బాగుంది. ఇప్పుడు మైనస్‌లోకి ఎందుకు వెళ్లారు. శివారు ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపర్చుతామని అధికారులు హామీ ఇచ్చారు. డ్రింకింగ్, ఆక్వాకు మేనేజ్ చేసి నీటి సరఫరా చేయాల్సిందే. నేను పర్యవేక్షిస్తానని సీఎం తెలిపారు. కైకలూరు స్పెషలాఫీసర్ 50:50లో ఎందుకున్నావ్.. మార్పు రావాలి.. గుర్తు పెట్టుకోవాలి. నేను ఐవీఆర్‌ఎస్, డిజిటల్ టెక్నాలజీ అనుసంధానం చేయడం, సర్వేల చేయడం వల్ల 72 ప్రజల సంతృప్తి స్థాయికి వచ్చింది. ప్రజల ఇచ్చిన తీర్పు ఆధారంగా మేము పనితీరులో మార్పు తీసుకువచ్చాం. మీరు రాగద్వేషాలు లేకుండా సంతృప్తి స్థాయిపై సరైన రీతిలో సమాధానం ఇవ్వాలి. రోడ్లపై గుంతలు పూడ్పించాలి. డ్రింకింగ్ వాటర్ అమలులో రాష్ట్రంకంటే ఆరు శాతం మెరుగ్గా ఇస్తున్నారంటూ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను అభినందించారు. వీధి దీపాల నిర్వహణ మెరుగైందని డీపీవో మల్లికార్జునరావు తెలిపారు. అన్నక్యాంటీన్ల నిర్వహణలో ఇంప్రూవ్ కావాలని జెడ్పీ సీఈవో జగదాంబను సూచించారు. రండీ సార్ బొట్టు పెట్టి పిలవాలా.. బీ కేర్ పుల్ అంటూ పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమేష్‌బాబును హెచ్చరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఫరవాలేదని డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.’ ఇలా వారి పనితీరుపై అర గంటపైనే సమీక్షించారు.