25న దెందులూరుకు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:30 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25న దెందులూరు పర్యటనకు రాను న్నారు. ఈ నేపఽథ్యంలో హెలీప్యాడ్‌కు, సభ నిర్వహణకు అనువైన స్థలం ఎంపి క కోసం గోపన్నపాలెంలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలను, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని, గోపన్నపాలెంకు సమీపంలోని పెదవేగి మం డలం లక్ష్మీపురం పరిధిలోని దెందులూరు మార్కెట్ యార్డు స్థలాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌లతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం రాత్రి పరిశీలించారు.
ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ప్రజావేదిక
కేడర్‌తో సమావేశమయ్యే అవకాశం
హెలీప్యాడ్, సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభాకర్, కలెక్టర్, ఎస్పీ
పెదవేగి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 25న దెందులూరు పర్యటనకు రాను న్నారు. ఈ నేపఽథ్యంలో హెలీప్యాడ్‌కు, సభ నిర్వహణకు అనువైన స్థలం ఎంపి క కోసం గోపన్నపాలెంలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలను, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని, గోపన్నపాలెంకు సమీపంలోని పెదవేగి మం డలం లక్ష్మీపురం పరిధిలోని దెందులూరు మార్కెట్ యార్డు స్థలాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌లతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం రాత్రి పరిశీలించారు. వీటిలో హెలీప్యాడ్‌తో పాటు ప్రజావేదికను ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో నిర్వహించడానికి అనువుగా ఉంటుందని భావించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనాభా నిర్వహణ (పాపులేషన్ మెయిన్‌టినెన్స్)కు సంబంధించి సీఎం పర్యటన ఉం టుందని అధికార వర్గాలు తెలిపాయి. గోపన్నపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అక్కడే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని చెబుతున్నారు. అనంతరం కేడర్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంటుందని, దీనికోసం దెందులూరు మార్కెట్ యార్డు అనువుగా ఉంటుందని భావించి ఆ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చంద్రబాబు తొలిసారి దెందులూరు నియోజకవర్గానికి రానున్న సందర్భంలో టీడీపీ కేడర్ ఉత్సాహంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో 2016, ఏప్రిల్ 23న సీఎంగా చంద్రబాబు నాయుడు పోలవరం కుడికాలువ పనుల పరిశీలనకు వచ్చారు. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ రహదారుల నిర్మా ణం చేపట్టగా 500 కిలోమీటర్ల మేర పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన పైలాన్‌ను పెదవేగి మండలం ముండూరులో ఆవిష్కరించారు. పదేళ్ల తర్వాత సీఎం చంద్రబాబు దెందులూరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగా చర్యలు చేపట్టింది. స్థల పరిశీలనలో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలతోపాటు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, దెందులూరు తహసీల్దారు సుమతి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.