Share News

ప్రజలతోనే ఉండాలి

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:46 AM

జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుంది.. ఇది చాలదు.. ఇంకా బలం మరింత పెరగాలి..

ప్రజలతోనే ఉండాలి

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం

అధికారులతో కలిసి సచివాలయంలో సమీక్ష

జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

ఏలూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు బాగుంది.. ఇది చాలదు.. ఇంకా బలం మరింత పెరగాలి.. ప్రజలతోనే ఉండాలి.. వారి సమస్యలపై సానుకూల ధోరణితో అందుబాటులో ఉండాలని సీఎం చంద్ర బాబు దిశా నిర్దేశం చేశారు. ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిఽధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో మంగ ళవారం భేటీ అయ్యారు. జిల్లా, నియోజకవర్గాలలో రాజకీయ పరిస్థితులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం గంటన్నరకు పైగా సమీక్షించారు ఎమ్మెల్యేల పనితీరు, సర్వే నివేదికలపై చర్చించారు. ఏలూరు పార్లమెంట్‌ పార్టీకి బలమైన నియోజకవర్గం. ఈబలం ఇంకా పెరగాలని కోరారు.

జిల్లాకు ముఖ్యమంత్రి వరాలు

నూజివీడులో మ్యాంగో మార్కెట్‌ యార్డు ఏర్పాటు, ఏలూరు ఆర్బన్‌ ప్రాంతంలో మరో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు సీఎం అంగీకరించారు.

రూ.22కోట్లతో అడవి నెక్కలం– వెల్వడం మద్య రహదారి విస్తరణ–పటిష్టత, నూజివీడు–ఏలూరు రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కోకోసిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని అందుబాటులోకి తీసుకురావాలని, రూ 40కోట్లతో ఏలూరు–పైడిచింతపాడు రోడ్‌నిర్మాణానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

12కోట్లతో ఏలూరు–మేడిశెట్టివారిపాలెం రహదారి, పడమటపాలెం–ములపర్రుగూడెం, కోరుకొల్లు–శ్రీహరిపురం రహదారి నిర్మాణానికి, రూ.30కోట్లతో ద్వారకాతిరుమల–ఐఎస్‌ జగన్నాథపురం రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు.

ఏలూరుజిల్లా పరిధిలో వివిద రహదారుల నిర్మాణాలను ప్రాధాన్యతల వారీగా చేపట్టాలని, నిధుల లభ్యతను చూసుకుని రోడ్ల నిర్మాణాలు మొదలుపెట్టాలని,. సాస్కీ నిధులతోనైనా జిల్లాలోని రోడ్‌ల నిర్మాణ పనులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో కొత్త ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు.

పట్టిసీమ నుంచి వీరభధ్రస్వామి దేవాలయానికి వంతెన నిర్మాణానికి సానుకూలంగా స్పందించారు.

సమీక్షకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌, మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు, చింతలపూడి, ఏలూరు, కైకలూరు, గోపాలపురం, పోలవరం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, సొంగా రోషన్‌ కుమార్‌, బడేటి రాధాకృష్ణ, కామినేని శ్రీనివాస్‌, మద్దిపాటి వెంకట్రాజు, చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజుతోపాటు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌ హాజరయ్యారు.

Updated Date - Mar 25 , 2026 | 12:46 AM