వ్యవసాయ,అనుబంధ రంగాల్లో.. మనమే టాప్
ABN , Publish Date - May 08 , 2026 | 12:33 AM
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వ ర్యంలో రెండు రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం ప్రారంభమైంది.
జీడీపీలో ఐదోస్థానం.. తలసరి ఆదాయంలో 4వ స్థానం
అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సుకు కలెక్టర్ వెట్రిసెల్వి హాజరు
నేడు సేంద్రియ ఉత్పత్తులపై ప్రజంటేషన్‌కు అవకాశం
ఏలూరు,మే7(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వ ర్యంలో రెండు రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం ప్రారంభమైంది. జిల్లా నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వి హాజరయ్యారు. తొలిరోజు సదస్సులో పలు అంశాలపై సీఎం సమీక్షించారు. కలెక్టర్ వెట్రిసెల్వి ప్రగతి నివేదికలను కాన్ఫరెన్స్‌లో సమర్పించారు. కలెక్టర్ల బెస్ట్ ప్రాక్టీసుల్లో భాగంగా సేంద్రి య ఉత్పత్తులపై వెట్రిసెల్వి రైతు సంప దపై ప్రజంటేషన్‌కు సన్నద్దం అయ్యా రు. రెండు రోజు శుక్రవారం సదస్సులో ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
వృద్ధి సాధించిన శాఖలివే.. జీడీ డీపీలో ఐదో ర్యాంకులో జిల్లా నిలిచింది. రూ.88,472 కోట్ల నుంచి రూ.102,806 కోట్ల సాధనతో 16.20 వృద్ధిరేటు నమో దైంది. తలసరి ఆదాయంలో నాల్గో స్థానంలో కొన సాగుతుండగా గత సమా వేశం నాటికి తలసరి ఆదాయం 3,76, 992 నుంచి ప్రస్తుతం రూ.4,37,002లకు పెరిగింది. వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటులో రూ.62,354 కోట్లతో ప్రథమస్థానంలో ఏలూరు జిల్లా నిలిచిం ది. పరిశ్రమల రంగంలో 8,264 కోట్లతో 21వ స్థానంలో, సేవా రంగంలో 24,312 కోట్లతో 13వ స్థానంలో నిలిచింది. ఓవ రాల్ ప్రగతి సూచికల్లో 84 పాయింట్లతో ఏలూరు 18వ స్థానంలో నిలిచింది. మోడల్ ప్రైమరీ స్కూల్స్ మఽఽధ్యాహ్న భోజనం అమలుపై ప్రజా సానుకూలత 74.80 శాతం నమోదైంది.
నేడు ఆర్‌టీజీఎస్, శాంతిభద్రతలపై సమీక్ష
కలెక్టర్ల సదస్సులో భాగంగా సూపర్‌సిక్స్, ఇతర పథకాలతో పాటు శాంతిభద్రతలతో సీఎం సమీక్షించనున్నారు. కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ పాల్గొంటారు.