Share News

ఏమా రేట్లు!

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:29 AM

‘ఏలూరు జిల్లాలో భూముల రేట్లు ఆకాశంలో విహరిస్తున్నాయి. ఎకరం రూ.70–80 లక్షలకు కొనుగోలు చేసి పరిశ్రమలను ఏర్పాటు చేయగలమా.. విశాఖలో పరిశ్రమలను నెల కొల్పుతున్నాం కానీ... ఏలూరులోనే పరిశ్రమలను పెట్ట లేకపోతున్నాం.. ఇక ఇక్కడ వ్యవసాయమే చేయ లేమో’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు.

 ఏమా రేట్లు!
సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

జిల్లాలో భూముల ధరలపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం

ఏలూరులో పరిశ్రమలు పెట్టలేకపోతున్నాం..

ఇక ఇక్కడ వ్యవసాయమే చేయాలేమో..

అన్నింటికి అడ్డు పడితే ఎలా.. అటవీశాఖ ఉన్నతాధికారులపై సీఎం సీరియస్‌

రామసింగవరం అటవీ భూముల పరిహారంపై కలెక్టర్‌ వె ట్రిసెల్వి ప్రస్తావన

కోకో సిటీ ఏర్పాటుపై చర్చ

రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై చర్చ

ఏలూరు,మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘ఏలూరు జిల్లాలో భూముల రేట్లు ఆకాశంలో విహరిస్తున్నాయి. ఎకరం రూ.70–80 లక్షలకు కొనుగోలు చేసి పరిశ్రమలను ఏర్పాటు చేయగలమా.. విశాఖలో పరిశ్రమలను నెల కొల్పుతున్నాం కానీ... ఏలూరులోనే పరిశ్రమలను పెట్ట లేకపోతున్నాం.. ఇక ఇక్కడ వ్యవసాయమే చేయ లేమో’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో గురు వారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో అటవీభూముల ప్రస్తావనపై జరిగిన చర్చల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.

నష్టపరిహారం వెనక్కి ఇప్పించండి..

జిల్లాలోని రామసింగవరంలోని 177 ఎకరాల భూములకు సంబంధించిన 2017లో జమ చేసిన రూ.15 కోట్లు వెనక్కి ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అటవీ శాఖకు, రెవెన్యూశాఖల మధ్య వివాదం రాజుకుంటోం దని.. ఇది 1948 రికార్డుల ప్రకారం గయ్యాళి భూమిగా నమోదై ఉందని, కాని అది అటవీశాఖదంటూ చెబు తున్నారని, ఇక్కడ పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పా ట్లు చేయాలని చాలాకాలం క్రితమే ప్రతిపాదనలు చేశారని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం అటవీశాఖాఽధికారులను ఆరా తీశారు. ఆ మొత్తం వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రెజ రీలో ఉన్నాయని పాలసీ ప్రకారం చేస్తామని అధికా రులు సమాధానం ఇచ్చారు.

కోకో సిటీ పైనా ఆరా

కోకో సిటీ ఏర్పాటుకు 500 ఎకరాల్లో ఏర్పాటు ఏమైందని? సీఎం ఆరా తీశారు. ‘చేస్తున్నాం... సార్‌ కనీసం 200 ఎకరాల్లోనైనా ఏర్పాటు చేయాలనే యోచ నలో ఉన్నాం.. ప్రస్తుతం రైతుల సాగు చేస్తున్న భూ ముల్లోనే చేద్దామని అనుకుంటున్నాం’ అని వెట్రిసెల్వి వివరించారు. ప్రైవేట్‌ ల్యాండ్స్‌ వారెలా ఇస్తారంటూ సీఎం ప్రశ్నించారు. ‘మీ ప్రాంతంలో స్థలాలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి..రూ.70–80 లక్షలు పెట్టి భూమి కొనగలామా, రూ.10–20 లక్షలైతే కొనొచ్చు. అందుకే మీ ఏలూరులో పరిశ్రమల ఏర్పాటు చేయలేకపోతు న్నాం’ అని సీఎం అన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రామసింగవరం భూములకు సంబంధించిన రూ.15 కోట్లు వెనక్కి ఇప్పిస్తే ఏలూరు చుట్టుపక్కలా భూసేక రణ జరపవచ్చన్నారు. జిల్లాలో చిన్నచిన్నగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ వివరించారు.

నూజివీడులో 90 ఎకరాలుంది..

ఈ చర్చలో పాల్గొన్న జిల్లాకు చెందిన మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నూజివీడు నియో జకవర్గంలో తోటపల్లిలో 90 ఎకరాలు ఏకమొత్తంగా స్థలం ఉందని సీఎం దృష్టికి తీసుకురాగా, అది డీ పట్టా ల్యాండ్‌ సార్‌.. గతంలో అసైన్డు చేశామని కలె క్టర్‌ వివరించారు. ప్రభుత్వ భూమి ఉంది కదా... ఒకసారి చూడండంటూ చంద్రబాబు సూచించారు.

టూరిజం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి ..

గోదావరి పుష్కరాలు ప్రారంభం అయ్యేలా టూరి జం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర బాబు కలెక్టర్లకు సూచించారు. కొల్లేరులో టూరిజానికి భవిష్యత్‌ ఉందని...దీనిపైన దృష్టి పెట్టాలని తెలిపారు.

ఏజెన్సీలో జనమన్‌ ఇళ్లు కట్టలేకపోతున్నాం..

అల్లూరి సీతారామరాజు జిల్లాలానే పాపికొండల సమీపంగా పోలవరం ఏజెన్సీలో జన్‌మన్‌ పథకం ఇళ్లు నిర్మాణాలు మంజూరు చేశారు. మంచినీటి బోరు వేయడానికి సిద్ధం అయ్యాం. కాని అభయా రణ్య భూమి అంటూ అటవీశాఖాధికారులు అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్‌ సీఎంకు తెలిపారు. దీనికి ఆయన స్పందిస్తూ ‘మీ యాటిట్యూట్‌ ఏమీ బాగా లేదు.. అన్నింటికి అడ్డుపడితే ఎలా’ అంటూ అటవీ శాఖ ఉన్నతాధికారులపై సీరియస్‌ అయ్యారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కనీసం మూడు గంటలైనా సమీక్షించాలన్నారు.

రోడ్డు టెర్రర్‌..15 శాతానికి పెరుగుదల

జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మృత్యువు బారిన పడుతున్న ఘటనలు కొకొల్లలు. ఏలూరు జిల్లాలో మృత్యువాత పడుతున్న శాతం 15కు ఎగబాకింది. జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దీనిపై సమీక్షించారు. 2024లో 290 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యుఒడికి చేరుకున్నారు. 2025–26 సంవత్సరంలో ఇప్పటి వరకు 345 మంది ప్రమాదాల్లో మరణించారు. 26 జిల్లాల్లో మన జిల్లా 23వ స్థానంలో నిలిచింది. గుంటూరు, ఎన్టీఆర్‌, అనంతపురాల్లో 15 శాతం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గగా, ఏలూరు జిల్లాలో 15 శాతం ప్రమాదాల పెరగడం కొంత ఆందోళన చెందా ల్సిన అంశం. కాగా శాంతి భద్రతలపై సీఎం సమీక్షించగా జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ జిల్లాకు సంబంధించిన నివేదికను సమర్పించారు. జిల్లాలోని శాంతి భద్రతలపై సీఎం ఆరా తీశారు.

Updated Date - Mar 13 , 2026 | 12:29 AM