Share News

ప్రగతి సూచికలు మెరుగు

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:26 AM

రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు కలెక్టర్‌ వెట్రిసెల్వి హాజరయ్యారు. మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో స్వర్ణాంధ్ర– 2047 విజన్‌ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాం ధ్ర, జీఎస్టీ లక్ష్యాలు, పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీ ఎస్‌, సుపరిపాలనలో సాంకేతికత, సంక్షేమ శాఖలు, పురపాలక సంఘాల్లో శానిటే షన్‌పై సమీక్ష జరిగింది.

ప్రగతి సూచికలు మెరుగు
కలెక్టర్ల సదస్సుకు హాజరైన వెట్రిసెల్వి

అగ్రి ఆధునికతలో ఏలూరు టాప్‌–5

సేవారంగంలో వృద్ధి రేటులో 14 స్థానం.. పరిశ్రమల వృద్ధి రేటులో 22..

ఆర్థిక రంగ సేవల్లో ఏడో ర్యాంకు

మాస్టర్‌ డాష్‌బోర్డులో అట్టడుగు నుంచి ఆరో స్థానానికి చేరిక

సంక్షేమ పథకాలు..ప్రజలకు మరింత చేరువ కావాలి.. స్వచ్ఛత అవార్డులకు పురాలను సిద్ధం చేయాలి

కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

ఏలూరు,మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సుకు కలెక్టర్‌ వెట్రిసెల్వి హాజరయ్యారు. మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో స్వర్ణాంధ్ర– 2047 విజన్‌ లక్ష్యాలు, పది సూత్రాలు, స్వచ్ఛాం ధ్ర, జీఎస్టీ లక్ష్యాలు, పీపీపీ ప్రాజెక్టులు, ఆర్టీజీ ఎస్‌, సుపరిపాలనలో సాంకేతికత, సంక్షేమ శాఖలు, పురపాలక సంఘాల్లో శానిటే షన్‌పై సమీక్ష జరిగింది. జిల్లాకు సంబంధించి వివిధ అంశా ల్లో ప్రగతి సూచికలు గతం కంటే మెరు గయ్యాయి. రెండోరోజు సదస్సుకు జిల్లా ఎస్పీ కిశోర్‌ హాజరు కానున్నారు. తొలిరోజ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘కూటమి అఽధికారంలోకి వచ్చాక 20 నెలల కాలంలో ఎన్నో సమీక్షలు చేసుకున్నాం.. ఇంకా కింద స్థాయిలో ప్రజల కు సంక్షేమ పథకాలు చేరువయ్యేలా కలె క్టర్లు అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి’ అని దిశా నిర్దేశం చేశారు. పురాల్లో స్వచ్ఛత అవార్డులకు పోటీ పడేలా కలెక్టర్లు పారిశుధ్యం, ఇతర పరిస్థి తులపై సమీక్షించడంతో పాటు పరిశీలనలు చేయాలని చంద్రబాబు ఆదేశిం చారు. గతేడాది కలెక్టర్ల బెస్ట్‌ ప్రాక్టీస్‌లపై విశ్లేషణలో కలెక్టర్‌ వెట్రిసెల్వి చేపట్టిన మార్పుపై స్వల్ప చర్చ సాగినా అన్ని జిల్లాల్లో ఈ విధానం అమలు చేయడం లేదని తేలింది.

అగ్రి ఆధునికతలో ముందంజ

వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక విని యోగంలో ఏలూరు టాప్‌–5లో చోటు దక్కించు కుంది. ఏఐ యాప్‌ను క్రియేట్‌ చేసి రైతులను ఈ యాప్‌లో మొత్తం 28,593 మందిని నమో దు చేయించారు. యాప్‌లో ప్రధానంగా పది సేవల్లో ఏలూరు జిల్లా ముందంజలో నిలిచింది. మన భూమి తాలూకా వివరాలు, వ్యవసాయ పద్ధ్దతులను యాప్‌లో క్షుణంగా చూసి అన్వ యించుకోవచ్చు. పథకాలను ఏ విధంగా రైతుల ఉపయోగించాలో, మార్కెట్‌లో ఏ రోజుకారోజు ధరలు తెలుసుకోవడం, కొత్త పథకాలపై ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లు చేసు కోవడం, చీడపీడలపై శాస్త్రవేత్తల సలహాలను యాప్‌ చూసి అనుకరించవచ్చు. విపత్తుల సం దర్భంగా పంట నష్టాల వివరాల్లో ఆయా రైతు ల వివరాలను సరిచూసుకోవడంలో మన జిల్లా ముందంజలో నిలిచింది. ఏయే అంశాలపై ఏయే అధికారులు సమీపంలో కలుసుకుని తెలుసుకు నేందుకు ఈ యాప్‌ అవకాశం కల్పించింది.

వివిధ రంగాల్లో మిశ్రమ ఫలితాలు

జిల్లా సేవారంగంలో వృద్ధి రేటులో సాధన లో 14వ స్థానంలో నిలిచింది. 2024–25లో 18,591 కోట్లు ఉండగా, అది నేడు 21,061కోట్లకు చేరుకుంది. పరిశ్రమల వృద్ధి రేటులో గతంలో 25వ స్థానంలో ఉండగా 22వ స్థానానికి చేరుకు న్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 7,921కోట్లు ఉండగా, ఇప్పటికీ 7,049 కోట్లకు చేరింది. స్కిల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ల్లో ఏలూరు జిల్లా 14వ స్థానంలో నిలిచింది. మొత్తం 32

రంగాలను కవర్‌ చేస్తూ 4,533 మందిని రిజిస్టర్‌ చేయించారు. ఆర్థిక రంగ సేవల్లో ఏలూరు జిల్లా ఏడో ర్యాంకులో నిలిచింది. ఏడు ప్రగతి సూచికలతో 95 పార్కు లతో ఏప్లస్‌ గ్రేడ్‌ను వశం చేసుకుంది.

వ్యవసాయ, అనుబంధరంగాల పురోగతిలో 13వ స్థానంలో ఏలూరు నిలిచింది. 39 ప్రగతి సూచికలతో 86 స్కోర్‌తో ఏ గ్రేడ్‌ను వశం చేసుకుంది. సేవారంగంలో జీడీపీ వృద్ధి 3 నుంచి 3.01కు ఎగకబాకింది.

మాస్టర్‌ డాష్‌బోర్డులో ఆరో స్థానం

జిల్లా సమగ్ర వివరాలను మాస్టర్‌ డాష్‌ బోర్డులో నమోదు చేయడంలో ఏలూరు అట్టడు గు స్థానం నుంచి ఆరోస్థానానికి ఎగబాకింది. ప్రగతి సూచికల నమోదులో ఇటీవల వెనుక బడి ఉండటంపై కలెక్టర్‌ వివిధ శాఖలను సమ న్వయ పరచడంతో జిల్లా ప్రగతి సూచికల్లో 316 నమోదయ్యాయి. స్కోర్‌ 86తో ఏ గ్రేడ్‌ను సాధిం చింది.

తలసరి ఆదాయం నమోదు జిల్లాలో నాల్గోస్థానంలో కొనసాగుతోంది. జిల్లాలో ఒక్కొక్కరికి తలసరి ఆదాయం 2024–25లో 3,49,145 ఉండగా, అది ఇప్పటికి 3,53,510లతో ఏలూరు ఉంది. జిల్లాలో 276.26 కోట్ల నిధులు విడుదల కాగా 223.19 కోట్లను యంత్రాంగం ఖర్చు చేసి 81 శాతం పురోగతిని సాధించి, 22వ స్థానంలో నిలిచింది.

Updated Date - Mar 12 , 2026 | 12:26 AM