సెగ..రేట్
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:25 AM
ధూమపానం ఆరోగ్యానికి హానికరమే కాదు.. ఎప్పుడో పడే టాక్స్‌తో కొందరు దానిని బ్లాక్ చేసి సెగ..రేట్‌గా మార్చేశారు.
కృత్రిమ కొరత.. బ్లాక్‌లో విక్రయాలు
డీలర్ల సిండికేట్.. పెరిగిన సిగరెట్ల ధరలు
మార్కెట్‌లో మందగించిన సరఫరా
ఒక్కో సిగరెట్‌పై రూ.2 వరకు పెరుగుదల
తాడేపల్లిగూడెం రూరల్/పాలకొల్లు టౌన్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ధూమపానం ఆరోగ్యానికి హానికరమే కాదు.. ఎప్పుడో పడే టాక్స్‌తో కొందరు దానిని బ్లాక్ చేసి సెగ..రేట్‌గా మార్చేశారు. మార్కె ట్‌లో అకస్మాత్తుగా పెరిగిన సిగరెట్ ధరలతో ధూమపానప్రియులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై పాన్ షాపుల వర్తకులపై మండిపడుతూ ఘర్షణ లకు దిగుతున్నారు. దీనికి మేమేం చేస్తాం.. మేమే ఎక్కువ రేటుకు కొంటున్నామని వారు వాపోతు న్నారు. సాధారణంగా కంపెనీలు ధరలు పెంచిన ప్పుడు అధికారిక ప్రకటనలు విడుదల చేస్తాయి. ఈసారి అలా జరగలేదు. సిగరెట్లపై జీఎస్టీ పెం పుతో త్వరలో ధరలు పెరగనున్నాయనే సమాచా రంతో డీలర్లు దుకాణాలకు సరఫరా తగ్గించి కావా లని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మొన్నటి వరకు కింగ్ సైజ్ సిగరెట్ రూ.18 ఉండగా ఇప్పుడు రూ.20 లకు విక్రయిస్తున్నారు. చిన్న గోల్డ్ ప్లాక్ సిగరెట్ రూ.10 నుంచి రూ.11, రూ.12లకు పెంచే శారు. ఇలా ఏ బ్రాండ్ సిగరెట్ చూసిన ఒక్కో సిగ రెట్‌పై రూపాయి నుంచి రెండు రూపాయలకు పెంచి అమ్ముతున్నారు. ప్రతీరోజు దుకాణాలకు సరఫరా చేసే కంపెనీల ఏజెంట్లు ఇచ్చిన ఆర్డర్‌లో సగం కూడా ఇవ్వడం లేదు. సరుకు లేదు కాబట్టే ఆర్డర్‌లో సగం ఇస్తాం. లేదంటే అదీ ఉండదని దబాయిస్తు న్నారని దుకాణాదారులు చెబుతున్నారు. కొరత పెరి గిన తర్వాత అధిక ధరలకు సరఫరా చేసి లాభాలు గడిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల చిన్న దుకాణదారులు నష్టపోతుండగా, వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బడ్జెట్‌కన్నా ముందుగానే సిండికేట్
సోమలాపురం అనిల్‌కుమార్, పాలకొల్లు
బడ్జెట్‌కన్నా ముందుగానే సిండికేట్‌గా టోకు వర్తకులు ఏర్పడి సిగరెట్లను అధిక ధరలకు అమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల టుబోకా సంబంధిత వస్తువులపై పన్నులను దాదాపు మూడు రెట్లు పెంచుతున్నట్టు ప్రక టించడంతో వ్యాపారులు ముందే సిగరెట్ల ధరలు పెంచేశారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.