సెగ..రేట్
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:22 AM
ధూమపానం ఆరోగ్యానికి హానికరమే కాదు.. ఎప్పుడో పడే టాక్స్‌తో కొందరు దానిని బ్లాక్ చేసి సెగ..రేట్‌గా మార్చేశారు.
బ్లాక్‌లో విక్రయాలు
డీలర్ల సిండికేట్.. పెరిగిన సిగరెట్ల ధరలు
మార్కెట్‌లో మందగించిన సరఫరా
ఒక్కో సిగరెట్‌పై రూ.2 వరకు పెరుగుదల
జంగారెడ్డిగూడెం రూరల్, జనవరి 24(ఆంధ్ర జ్యోతి):ధూమపానం ఆరోగ్యానికి హానికరమే కాదు.. ఎప్పుడో పడే టాక్స్‌తో కొందరు దానిని బ్లాక్ చేసి సెగ..రేట్‌గా మార్చేశారు. మార్కెట్‌లో అకస్మా త్తుగా పెరిగిన సిగరెట్ ధరలతో ధూమపానప్రియులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై పాన్ షాపుల వర్తకు లపై మండిపడుతూ ఘర్షణలకు దిగుతున్నారు. దీనికి మేమేం చేస్తాం.. మేమే ఎక్కువ రేటుకు కొంటున్నామని వారు వాపోతున్నారు. సాధా రణంగా కంపెనీలు ధరలు పెంచినప్పుడు అధికారిక ప్రకటనలు విడుదల చేస్తాయి. ఈసారి అలా జరగలేదు. సిగరెట్లపై జీఎస్టీ పెంపుతో త్వరలో ధరలు పెరగనున్నాయనే సమాచా రంతో డీలర్లు దుకాణాలకు సరఫరా తగ్గించి కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మొన్నటి వరకు కింగ్ సైజ్ సిగరెట్ రూ.18 ఉండగా ఇప్పుడు రూ.20లకు విక్రయిస్తున్నారు. చిన్న గోల్డ్ ప్లాక్ సిగరెట్ రూ.10 నుంచి రూ.11, రూ.12లకు పెంచేశారు. ఇలా ఏ బ్రాండ్ సిగరెట్ చూసిన ఒక్కో సిగరెట్‌పై రూపాయి నుంచి రెండు రూపాయలకు పెంచి అమ్ముతున్నారు. ప్రతీరోజు దుకాణాలకు సరఫరా చేసే కంపెనీల ఏజెంట్లు ఇచ్చిన ఆర్డర్‌లో సగం కూడా ఇవ్వడం లేదు. సరుకు లేదు కాబట్టే ఆర్డర్‌లో సగం ఇస్తాం. లేదంటే అదీ ఉండదని దబాయిస్తున్నారని దుకాణాదారులు చెబు తున్నారు. కొరత పెరిగిన తర్వాత అధిక ధరలకు సరఫరా చేసి లాభాలు గడిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల చిన్న దుకాణదారులు నష్టపోతుండగా, వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.