Share News

చింతలపూడి కూటమిలో జోష్‌

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:13 AM

చింతలపూడి నగర పంచాయతీ చైర్మన్‌ పదవికి కూటమి అభ్యర్థినిగా కంభం ఎస్తేరురాణి (టీడీపీ) పేరును అధిష్ఠానం ఖరారు చేసింది.

 చింతలపూడి కూటమిలో జోష్‌

కూటమి చైర్మన్‌ అభ్యర్థినిగా ఎస్తేరురాణి ఖరారు.. నేడు నామినేషన్‌

చింతలపూడి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి):చింతలపూడి నగర పంచాయతీ చైర్మన్‌ పదవికి కూటమి అభ్యర్థినిగా కంభం ఎస్తేరురాణి (టీడీపీ) పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో కూటమి శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు సోమవారం నామినేషన్‌ వేయనున్నట్టు తెలిసింది. ఈమె భర్త కంభం రమేశ్‌ చింతలపూడి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా పని చేస్తున్నారు. రమేశ్‌ అండ్రి సోమయ్య విద్యుత్‌శాఖలో పనిచేసేవారు. ఈమె పదో తరగతి వరకు చదువుకున్నారు. పట్టణంలో అందరికీ చిరపరిచితులు. మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

13 నామినేషన్లు దాఖలు

చింతలపూడి నగర పంచాయతీ పురపోరు ఎన్నికల్లో రెండవ రోజు ఆదివారం చైర్మన్‌ పదవికి ఒకటి, కౌన్సిలర్‌ స్థానాలకు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్‌ పదవికి టీడీపీ తరపున టిక్కెట్‌ అశించిన కొక్కిరిగడ్డ విజయసుధ నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల స్వీకరణ ముగింపు రోజు కావడంతో నామి నేషన్‌ వేసే అభ్యర్థులు సహకరించాలని, మధ్యాహ్నం 3 గంటలు దాటితే అనుమతించ బోమని మునిసి పల్‌ కమిషనర్‌ అంబటి రాంబాబు తెలిపారు. ముందుగా పోలీసు కౌంటర్‌ వద్ద టోకెన్‌ తీసుకుని అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే లోపలికి రావాలని తెలిపారు. ఇక కూటమిలో కౌన్సిలర్‌ పదవులకు చర్చలు ముగిశాయి. టీడీపీ తరపున 17 వార్డులకు, జనసేన ఐదు, బీజేపీ ఒక స్థానంలో పోటీ చేయాలని కేటాయింపులు జరిగాయి.

Updated Date - Nov 16 , 2026 | 12:13 AM