తొలిరోజు చైర్మన్ నామినేషన్లు నిల్
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:06 AM
చింతలపూడి నగర పంచాయతీలో తొలిసారి జరుగుతున్న ఎన్నికల కోసం మునిసిపల్ కార్యా లయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో శనివారం తొలిరోజు చైర్మన్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు.
13వ వార్డుకు రెండు దాఖలు
చింతలపూడి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): చింతలపూడి నగర పంచాయతీలో తొలిసారి జరుగుతున్న ఎన్నికల కోసం మునిసిపల్ కార్యా లయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో శనివారం తొలిరోజు చైర్మన్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు. 13వ వార్డుకు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారి అంబటి రాంబాబు తెలిపారు. నగర పంచాయతీలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. కూటమిలో వార్డు సభ్యుల కేటాయింపుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. కూటమితో పాటు వైసీపీలోను చైర్మన్ అభ్యర్థులు ఖరారు కాలేదు. కాగా నగర పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని, కౌంటింగ్, స్ట్రాంగ్ రూము కేంద్రాలను నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర రావు శనివారం పరిశీలించారు. మునిసిపల్ కార్యాలయం ఆవరణలో నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు పర్యవేక్షించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూము, ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు. కమిషనర్ అంబటి రాంబాబు, సీఐ క్రాంతికుమార్, ఎస్‌ఐ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.