Share News

చింతలపూడికి లైన్‌క్లియర్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:50 AM

ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాల మెట్ట భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడంతో పాటు కొన్ని వందల గ్రామాల్లోని 26 లక్షల మంది ప్రజలకు తాగునీరు సమస్యను తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు జాతీ య హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) అనుమతి మంజూరు చేసింది.

చింతలపూడికి లైన్‌క్లియర్‌
చాట్రాయి మండలంలో అసంపూర్తిగా చింతలపూడి–2 కాలువ (ఫైల్‌)

ఎత్తిపోతల పథకానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ గ్రీన్‌సిగ్నల్‌

ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు

యకట్టు రైతులు..ప్రజలు హర్షం

చాట్రాయి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఐదు లక్షల ఎకరాల మెట్ట భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడంతో పాటు కొన్ని వందల గ్రామాల్లోని 26 లక్షల మంది ప్రజలకు తాగునీరు సమస్యను తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు జాతీ య హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) అనుమతి మంజూరు చేసింది. ఎన్‌జీటీ నుంచి శుక్రవారం అనుమతులు వచ్చినట్టు అధికారిక సమాచారం. అనుమతులు రావడం పట్ల ఆయ కట్టు రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పఽథకానికి అనుమతుల కోసం సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు, జలవనరుల శాఖ చేసిన న్యాయ పోరాటం ఫలించింది. నూజివీడు కూటమి ఎమ్మెల్యే, గృహ నిర్మాణ, సమాచార మంత్రి కొలుసు పార్థసారథి ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే ఈ పథకాన్ని పూర్తి చేస్తానని, పూర్తి చేయలేకపోతే మళ్లీ ఓట్లు అడగడానికి రాన ని ఓటర్లకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే మంత్రి పార్థసారథి, ఏలూరు, విజయవాడ ఎంపీలు పుట్టా మహేశ్‌ యాదవ్‌, కేశినేని శివనాథ్‌ కృషితో పథకానికి పూర్వ వైభవం రానున్నది. కాగా ఈనెలలోనే పనులు పునః ప్రారంభిస్తా మని ఇటీవల సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్‌–1కి 2008లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన జరిపారు. ఫేజ్‌–2కి 2017 సెప్టెంబరు 17న ప్రస్తుత ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట సమీపంలోని మొద్దులపర్వ వద్ద అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు వేగంగా జరిపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకానికి రూ.4,909 కోట్లుతో (1,2 ఫేజ్‌లు కలిపి) పనులు చేపట్టి సుమారు 60 శాతం పూర్తి చేసింది. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో పథకానికి దుర్దశ పట్టింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు తట్ట మట్టి వేయకుండా పఽథకాన్ని బ్రష్టు పట్టించింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారని, 2018లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్‌ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ట్రిబ్యునల్‌ విచారణ జరిపిన 2022లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.73 కోట్లు జరిమానా విధించింది. దీనిపై అప్పటి జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు నెలలు గడువు ఇచ్చి జరిమానా చెల్లించడం లేదా పర్యావరణ అనుమతులు తీసుకోవడం చేయాలని ఆదేశించింది. దీనిని వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు వర్కు స్టాప్డ్‌ ఉత్వర్వులు ఇచ్చిం ది. జగన్‌ ప్రభుత్వం తప్పిదాల వల్ల కూటమి ప్రభుత్వం పథకం పనులు పునః ప్రారంభించడానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు ప్రాధాన్యత ప్రాజెక్టులలో చింతలపూడిని చేర్చినా పనులు పునః ప్రారంభంలో కొంత జాప్యం జరిగింది. ఫేజ్‌–1లో నిర్వాసిత రైతులు కోర్టులో వేసిన 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫేజ్‌–1లో నిర్వాసిత రైతులకు రూ.125 కోట్లు, ఫేజ్‌–2లో రూ.30 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంది. పఽథకం వల్ల లబ్ధి పొందే నియోజకర్గాలు, మండలాలు... ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు, నూజివీడు , ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో మైలవరం, తిరువూరు, గన్నవరం,నందిగామ అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, పెదవేగి, దెందులూరు,పెదపాడు, చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచకచర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు. నూజివీడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు. ఆగిరిపల్లి, విజయవాడ (రూరల్‌) మండలాలకు గోదావరి జలాలు అంది సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

నిజమైన దీపావళి ఇది

ఏలూరు, ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు, ప్రజలకు ఇది నిజమైన దీపావళి పండుగ. చింతలపూడి ఎత్తి పోతల పఽథకానికి పర్యావరణ అను మతులు సీఎం చంద్రబాబు సాధించడం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. వెంటనే పనులు పునఃప్రారంభించి పఽథకాన్ని త్వరగా పూర్తి చేయాలి.

– వెల్ది రాజారావు, రైతు, మర్లపాలెం

సాగు,తాగునీటి సమస్యలకు పరిష్కారం

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలగడం శుభాపరిణామం. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందనడానికి ఇది నిదర్శ నం. పఽథకం ఉపయోగంలోకి వస్తే ఈ ప్రాంతంలో బంగా రు పంటలు పండటమే కాక తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది.

– మంచిన పూర్ణచంద్రరావు, రైతు, కోటపాడు

Updated Date - Nov 03 , 2026 | 12:50 AM