Share News

చింతలపూడి కాలువ మాకొద్దు..

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:38 AM

‘చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ మా గ్రామంలోని పంట పొలాల స్వరూపాన్ని మార్చేస్తోంది. ఈ కాలువతో మాకు కలిగే లాభాలేమీ లేకపోగా నష్టాలే అధికంగా ఉన్నాయి. ఈ కాలువను ఆపేయాలి’ అంటూ బాపిరాజుగూడెం రైతులు చింతలపూడి ఎత్తిపోతల పథకం డీఈ ఏసుబాబుకు విన్నవించారు.

చింతలపూడి కాలువ మాకొద్దు..
డీఈ ఏసుబాబుకు వినతిపత్రం అందిస్తున్న బాపిరాజుగూడెం గ్రామస్థులు

పీజీఆర్‌ఎస్‌లో బాపిరాజుగూడెం రైతుల వినతి

కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామాన్ని సందర్శించిన డీఈ

పెదవేగి, జూలై 22(ఆంధ్రజ్యోతి):‘చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ మా గ్రామంలోని పంట పొలాల స్వరూపాన్ని మార్చేస్తోంది. ఈ కాలువతో మాకు కలిగే లాభాలేమీ లేకపోగా నష్టాలే అధికంగా ఉన్నాయి. ఈ కాలువను ఆపేయాలి’ అంటూ బాపిరాజుగూడెం రైతులు చింతలపూడి ఎత్తిపోతల పథకం డీఈ ఏసుబాబుకు విన్నవించారు. ఇటీవల వారు పీజీఆర్‌ఎస్‌లో ఈ విషయంపై కలెక్టర్‌ వెట్రిసెల్వికి అర్జీ సమర్పించారు. కలెక్టర్‌ ఆదేశాలను అనుసరించి పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావు సూచనల మేరకు డీఈ ఏసుబాబు బాపిరాజుగూడెం వచ్చి రైతులతో మాట్లాడారు. కాలువ వల్ల మా భూముల విలువ తగ్గిపోతోందని, గ్రామం వరకు వచ్చిన కాలువ అక్కడ నుంచి తమ్మిలేరు కాలువలో కలుస్తుందని, గొట్టపు బావుల ఆధారంగా మా భూముల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నామని, కాలువతో మాకు ఒరిగేది ఏమీ లేదని రైతులు వివరిస్తూ డీఈకి వినతిపత్రం అందించారు. డీఈ మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. విజయరాయి సొసైటీ చైర్మన్‌ బొప్పన సుధాకర్‌, నీటిసంఘం అధ్యక్షుడు కూరపాటి ధర్మా రావు, ముక్కామల వెంకట సదాశివ సత్యనారాయణ, తలకొండ జమలయ్య, బొప్పన ప్రకాష్‌, వీరవెంకట సత్యనారాయణ, బొల్లిన మురళి, సతీష్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:38 AM